Telugu Global
Andhra Pradesh

ఏపీలో గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల

మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది APPSC. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి.

ఏపీలో గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల
X

ఏపీలో నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల చేసింది APPSC. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

ఈనెల(డిసెంబర్) 21 నుంచి 2024జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

స్క్రీనింగ్(ప్రిలిమినరీ) పరీక్ష 2024 ఫిబ్రవరి -25

అర్హత - డిగ్రీ, ఆపైన

కొత్త సిలబస్ ప్రకారం పరీక్ష ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ లో మెరిట్ వచ్చినవారికి రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాలు కేటాయిస్తారు.


గ్రూప్-2 తోపాటు గ్రూప్-1 కి కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదలవుతుంది అనుకున్నా అది సాధ్యం కాలేదు. గ్రూప్-1 నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయినట్టే లెక్క. చాన్నాళ్లుగా నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ఏడాదిలో నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. గ్రూప్స్ తోపాటు త్వరలో ఏపీ ప్రభుత్వం మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశముంది.

First Published:  7 Dec 2023 3:48 PM GMT
Next Story