Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు టేక్ అవుట్ భలే దొరికిందే..

సీబీఐ కౌంటర్లో చెప్పేంతవరకు గూగుల్‌లో అలాంటి సాంకేతికత ఉందని చంద్రబాబుకు తెలిసుండదు. అయినాసరే కొత్తగా ఉందికాబట్టి వెంటనే ఇక గూగుల్ టేక్ అవుట్ అనే పదాన్ని పార్టీ సమావేశాల్లో వాడేస్తున్నారు.

చంద్రబాబుకు టేక్ అవుట్ భలే దొరికిందే..
X

చంద్రబాబునాయుడు వైఖరికి సంబంధించి కొత్త ఒక‌ వింత-పాత ఒక రోత‌.., కోతికి కొబ్బరికాయ దొరికినట్లు..ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పవచ్చు. ఎందుకంటే రెండు రోజులుగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఒక సాంకేతికను పదేపదే ప్రమోట్ చేస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే గూగుల్ టేక్ అవుట్. గూగుల్లో ఇలాంటి అత్యాధునిక సాంకేతికత ఉందని చంద్రబాబుకు రెండు రోజుల క్రితం వరకు తెలిసుండదు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మూడు రోజుల క్రితం కౌంటర్ దాఖలు చేసింది. అందులో వివేకా హత్యలో నిందితుల్లో కొందరి మొబైల్ ఫోన్ల లొకేషన్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి ప్రాంతంలోనే చూపించిందని చెప్పారు.

ఈ వివరాలు సేకరించేందుకు తాము గూగుల్ టేక్ అవుట్ అనే సాంకేతికతను ఉపయోగించుకున్నట్లు చెప్పారు. ఇంకేముంది ఆ పదం కొత్తగా ఉండటంతో చంద్రబాబును బాగా ఆకర్షించినట్లుంది. సీబీఐ కౌంటర్లో చెప్పేంతవరకు గూగుల్‌లో అలాంటి సాంకేతికత ఉందని చంద్రబాబుకు తెలిసుండదు. అయినాసరే కొత్తగా ఉందికాబట్టి వెంటనే ఇక గూగుల్ టేక్ అవుట్ అనే పదాన్ని పార్టీ సమావేశాల్లో వాడేస్తున్నారు. సాంకేతికత ఆధారంగా బాబాయ్‌ని చంపింది అబ్బాయే అంటే జగన్మోహన్ రెడ్డే అని సీబీఐ నిర్ధారణ చేసినట్లగా చంద్రబాబు తేల్చేశారు.

బాబాయ్‌ను ఎవరు చంపారనే విషయాన్ని గూగుల్ టేక్ అవుట్ పట్టిస్తుందని అప్పట్లో జగన్ తెలుసుకోలేకపోయారట. కానీ ఇప్పుడు గూగుల్ టేక్ అవుట్ సాంకేతికత ద్వారా అబ్బాయే బాబాయ్‌ని చంపినట్లు మొత్తం ప్రపంపచానికంతా తెలిసిపోయిందని పదేపదే బురద చల్లేస్తున్నారు.

చంద్రబాబు ఆలోచన ఏమిటంటే వివేకాను జగనే చంపాడని జనాలంతా అనుకోవాలని. వివేకా మర్డర్ కేసులో ఎలాగైనా జగన్‌ను ఇరికించేయాలన్న తపన చంద్రబాబులో బాగా పెరిగిపోతోంది. ఇలాంటి ఏదో కేసులో జగన్‌ను ఇరికించి జైలుకు పంపితే తప్ప చంద్రబాబు మనస్సు శాంతించేట్లుగా లేదు. ఇందుకోసం ఎంత బురద చల్లటానికైనా, ఎల్లో మీడియాతో చల్లించేందుకు ఎంతకైనా తెగించేస్తున్నారు. గూగుల్ టేక్ అవుట్ సాంకేతికలో నిందితుల ఫోన్లు ఎంపీ ఇంటి పరిసరాల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతుంటే చంద్రబాబేమో వివేకాను జగనే చంపేశారని ప్రపంచానికి తెలిసిపోయిందని పదేపదే చెబుతున్నారంటే అర్థ‌మేంటి?

First Published:  25 Feb 2023 6:10 AM GMT
Next Story