Telugu Global
Andhra Pradesh

లూథ్రాకు గుడ్ బై చేప్పేశారా?

హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్లను గురువారం రెగ్యులర్ లాయర్లే వాదించారు. ఇంతలో లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. సుప్రీంకోర్టు లాయర్లతో భేటీ అవబోతున్నారంటేనే లూథ్రా ప్లేసులో వేరే వాళ్ళను ఎంగేజ్ చేసుకోబోతున్నారని అర్థ‌మవుతోంది.

లూథ్రాకు గుడ్ బై చేప్పేశారా?
X

మూడు కేసుల్లో చంద్రబాబునాయుడు తరపున కోర్టుల్లో వాదించి ఫెయిలైన సిద్దార్థ‌ లూథ్రాకు చంద్రబాబు కుటుంబం గుడ్ బై చెప్పేసిందా? తాజా పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సడెన్‌గా నారా లోకేష్ రాజమండ్రి నుండి ఢిల్లీకి వెళ్ళారు. లోకేష్ ఢిల్లీలో నాలుగు రోజులుండబోతున్నారు. గురువారం రాత్రి విమానంలో భువనేశ్వరి, లోకేష్ కలిసి ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. అయితే కొందరేమో లోకేష్ ఒక్క‌రే వెళ్ళారని అంటున్నారు. ఏదేమైనా ఇక్కడ కీలక పరిణామం ఏమిటంటే లోకేష్ ఢిల్లీ పర్యటనలో రెండు పాయింట్లున్నాయి.

మొదటిదేమో తన తండ్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై జాతీయ మీడియాకు ప్రజంటేషన్ ఇవ్వటం. రెండోది ఏమిటంటే సుప్రీంకోర్టు లాయర్లతో భేటీ అవ్వటం. దేశంలోని ప్రముఖ, అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరైన లూథ్రానే చంద్రబాబు తరపున ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా వాదించారు. అయితే ఎంత వాదించినా చంద్రబాబుకు బెయిల్ తెప్పించటంలో విఫలమయ్యారు. దాంతో రెండున్నర రోజులు విజయవాడలోనే ఉన్న లూథ్రా చివరకు రాజమండ్రిలో చంద్రబాబుతో భేటీ అయి ఢిల్లీకి వెళ్ళిపోయారు.

హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్లను గురువారం రెగ్యులర్ లాయర్లే వాదించారు. ఇంతలో లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. సుప్రీంకోర్టు లాయర్లతో భేటీ అవబోతున్నారంటేనే లూథ్రా ప్లేసులో వేరే వాళ్ళను ఎంగేజ్ చేసుకోబోతున్నారని అర్థ‌మవుతోంది. లూథ్రానే కేసులను వాదించేట్లయితే ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి లోకేష్ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది?

ఇక మీడియా ప్రజంటేషన్ వ్యవహారం చూస్తే టీడీపీ మొదటి నుండి మీడియా ప్రచారం మీదే ఎక్కువగా ఆధారపతోంది. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మీడియా ద్వారానే చంద్రబాబు కలరింగ్ ఇచ్చుకుని రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుకు ఉన్న మీడియా బలం అందరికీ తెలిసిందే. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అరెస్టు, రిమాండులో కొన్ని జాతీయ ఛానళ్ళు చంద్రబాబు అరెస్టయ్యారని ప్రముఖంగా డిబేట్లు పెట్టాయి. అందులో స్కామ్ జరిగిందన్న అర్థ‌మొచ్చేట్లుగానే డిబేట్లున్నాయి. దాంతో డ్యామేజ్‌ కంట్రోల్‌కు లోకేష్ రంగంలోకి దిగినట్లు అర్థ‌మవుతోంది. మరి ఢిల్లీ పర్యటనలో ఏమి సాధిస్తారో చూడాల్సిందే.


First Published:  15 Sep 2023 5:33 AM GMT
Next Story