Telugu Global
Andhra Pradesh

జనసేనకు గుడ్‌న్యూస్‌.. శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు

సాధారణంగా శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. కనీసం రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలవాలి.

జనసేనకు గుడ్‌న్యూస్‌.. శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు
X

ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్‌న్యూస్‌. గాజు గ్లాసు సింబల్‌ విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో జనసేన సాధించిన ఓటింగ్‌తో గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. త్వరలోనే దీనిపై కీలక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

సాధారణంగా శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. కనీసం రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలవాలి. కానీ, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన జనసేన.. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ సీట్లలోనూ విజయం సాధించింది.

ఇక జనసేన మొత్తంగా 8.53 శాతం ఓట్‌ షేర్‌ను దక్కించుకుంది. మరోవైపు జనసైనికులు ప్రభుత్వంలో పవన్‌కల్యాణ్‌కు కీలక పదవి ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

First Published:  5 Jun 2024 10:17 AM GMT
Next Story