Telugu Global
Andhra Pradesh

వీరయ్యకు నో.. వీరసింహారెడ్డికి ఓకే

ఇటీవలే జీవో నెంబర్1 విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహకులు వేదికను ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌కు మార్చారు.

వీరయ్యకు నో.. వీరసింహారెడ్డికి ఓకే
X

త్వరలో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్రనటుల సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఏపీలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ వారే కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే బాలయ్య వీరసింహారెడ్డి ఈవెంట్ కు అనుమతి వచ్చింది కానీ.. చిరంజీవి సినిమాకు రాలేదు. ఇటీవల సభలు, సమావేశాలపై నియంత్రణ విధిస్తూ ఏపీ సర్కారు జీవో 1 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రూల్స్ లో భాగంగా చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యకు పర్మిషన్ దక్కలేదు.

బాలయ్యకు ముందు నో .. తర్వాత అనుమతి

ఈ నెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్‭లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని వీరసింహారెడ్డి సినిమా యూనిట్ తలపెట్టింది. అయితే అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటం.. ఇటీవలే జీవో నెంబర్1 విడుదల చేసిన నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో నిర్వాహకులు వేదికను ఇన్‌ఫ్రా గ్రౌండ్స్‌కు మార్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్‭లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాల్తేరు వీరయ్య మూవీకి నో పర్మిషన్

మెగాస్టార్ చిరంజీవి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు పోలీసులు బ్రేక్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్కే బీచ్‌లో ఈనెల 8న నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సైతం చేస్తోంది. అయితే జీవో నెంబర్ 1 విడుదల నేపథ్యంలో పోలీసులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆంక్షలు విధించారు. స్టేజ్ పనులు నిలిపి వేయాలని నిర్వాహకులకు అధికారుల ఆదేశాలిచ్చారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది త్వరలో నిర్ణయిస్తామని పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది.

First Published:  5 Jan 2023 2:31 PM GMT
Next Story