Telugu Global
Andhra Pradesh

'గాజు గ్లాసు' ఫ్రీ సింబల్.. పవన్ కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?

తాజా ఎన్నికల్లో గాజు గ్లాసు ఫ్రీసింబల్ అయితే.. జనసేన పోటీ చేయని మిగతా చోట్ల కూటమికి తీవ్ర ఇబ్బందులు ఎదురవక తప్పదు.

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.. పవన్ కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేయాల్సిందేనా..?
X

సార్వత్రిక ఎన్నికల వేల జనసేనకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కమిషన్.. జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్‌ పార్టీగానే గుర్తించింది. గుర్తింపు పొందిన పార్టీల లిస్ట్ లో జనసేనకు చోటివ్వలేదు. ఏపీనుంచి కేవలం వైసీపీ, టీడీపీ మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలు అని, వాటికి మాత్రమే గుర్తులు కేటాయించినట్టు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్ గా ఈసీ పేర్కొనడంతో జనసేనకు షాక్ తగిలింది.

ఇటీవల గాజు గ్లాసుని తమకే కేటాయించారంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి హడావిడి చేసింది. అయితే ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఈసీ గెజిట్ నోటిఫికేషన్ ఆ పార్టీకి షాకిచ్చేలా ఉంది. మరి ఈ గుర్తుకోసం పవన్ పోరాటం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు గాజు గ్లాసు గుర్తు తమదేనంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో పోరాటం చేస్తోంది. ఈ విచారణలో గాజు గ్లాసు ఏ పార్టీకి వెళ్తుందో చూడాలి.

ఎందుకీ అవస్థ..?

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారే కానీ దాని వ్యవహారాలపై ఆయనకు పెద్దగా పట్టులేదు. పార్టీకి గుర్తింపు ఉండాలన్నా, పార్టీకి ఓ గుర్తు ఉండాలన్నా.. ఎన్నికల్లో పోటీ చేయాలి, ఈసీ నియమావళి ప్రకారం ఓటింగ్ శాతం ఉండాలి. కానీ జనసేన త్యాగాల పేరుతో ప్రతి ఎన్నికనూ వదిలేస్తూ వచ్చింది. పోనీ పోటీ చేసిన చోట అయినా గెలిచిందా అంటే.. అదీ లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు గెల్చుకున్నారు, ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా చేజారారు. ఇలాంటి పరిస్థితుల్లో పదే పదే గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో ఉండటం చూస్తూనే ఉన్నాం. తాజా ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు ఫ్రీసింబల్ అయితే.. జనసేన పోటీ చేయని మిగతా చోట్ల కూటమికి తీవ్ర ఇబ్బందులు ఎదురవక తప్పదు.

పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కిద్ది అంటూ పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు బాగానే చెబుతారు కానీ.. అసలు గాజు గ్లాసుని గుర్తుగా సాధించడంలో ఆయన మరోసారి విఫలం అయ్యారని తేలిపోయింది. ఏపీ సీఎం జగన్ చెప్పినట్టు.. గ్లాసు సింకులో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

First Published:  2 April 2024 7:29 AM GMT
Next Story