Telugu Global
Andhra Pradesh

గీతాంజలి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఉంటే..?

కేవలం ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా ట్రోలింగ్ బాధితులేనని చెప్పారు హోం మంత్రి వనిత. మహిళా ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి వేధింపులే వస్తున్నాయని, కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల, పని ఒత్తిడిలో తాము వాటిని పట్టించుకోవడం లేదన్నారు.

గీతాంజలి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఉంటే..?
X

గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. టీడీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి దారుణమైన ట్రోలింగ్ జరగడంతో.. అవమానంగా భావించి ఆమె ఆత్మహత్య చేసుకుందనేది ప్రాథమిక సమాచారం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, కుటుంబానికి అన్యాయం జరగకుండా ఉండాలంటే.. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత. గీతాంజలి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఉంటే కాపాడుకుని ఉండే వాళ్ళమని చెప్పారామె.

టీడీపీ- జనసేన కార్యకర్తలు.. ఫేక్ అకౌంట్లు ఏర్పాటు చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు హోం మంత్రి వనిత. టీడీపీ- జనసేన సోషల్ మీడియా ఎంతలా దిగజారిపోయిందో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుందన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి ట్రోలింగ్ లు మొదలు పెట్టారని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజ్ లు, ట్రోలింగ్ ల గురించి మహిళలు ఆందోళన చెందవద్దని, అధైర్య పడవద్దని సూచించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ప్రజా ప్రతినిధులు కూడా బాధితులే..

కేవలం ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు కూడా ట్రోలింగ్ బాధితులేనని చెప్పారు హోం మంత్రి వనిత. మహిళా ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి వేధింపులే వస్తున్నాయని, కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల, పని ఒత్తిడిలో తాము వాటిని పట్టించుకోవడం లేదన్నారు. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై విచారణ కొనసాగుతుందని, కారుకులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. వేధింపులకు కారణమైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు హోం మంత్రి తానేటి వనిత.

First Published:  13 March 2024 8:46 AM GMT
Next Story