Telugu Global
Andhra Pradesh

జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డ `గంటా`

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత రెచ్చిపోతున్నారు అనటానికి ప్రభుత్వంపై గంటా చేసిన తాజా ట్వీటే ఉదాహరణ. ఆయన ట్వీట్లో ఏముందంటే ‘ఉత్తరాంధ్ర ఉతికారేసింది..తూర్పు రాయలసీమ తుక్కు రేగ్గొట్టింది..పశ్చిమ రాయలసీమ పడుకోబెట్టింది..ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్టయ్యింది..జై తెలుగుదేశం..సైకో పాలన పోవాలి..సైకిల్ పాలన రావాలి’.

జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డ `గంటా`
X

చివరకు ఏమనుకున్నారో ఏమో కానీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రెచ్చిపోతున్నారు. వైసీపీలోకి వెళ్ళే అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూశారు. ఇక అవకాశం దొరకదని తీర్మానించుకున్నట్లున్నారు. ఇదే సమయంలో జనసేనలోకి వెళతారనే ప్రచారం కూడా బాగా జరిగింది. అయితే వ్యక్తిగతంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు గంటా అంటే ఏమాత్రం పడదు. కాబట్టి అందులోకి వెళ్ళే అవకాశం రాలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్‌లో చేరటం ఖాయమనే ప్రచారం జరిగింది. చివరలో అక్కడా కుదరలేదన్నారు.

ఇవన్నీ లాభంలేదని అనుకున్నట్లున్నారు. అందుకనే టీడీపీలోనే కంటిన్యూ అయ్యేందుకు తీర్మానించుకున్నారు. అప్పటి నుండి రెచ్చిపోతున్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీలో పాతుకుపోవటానికి బాగా ఉపయోగించుకున్నారు. ఫలితాల తర్వాత రెచ్చిపోతున్నారు అనటానికి ప్రభుత్వంపై గంటా చేసిన తాజా ట్వీటే ఉదాహరణ. ఆయన ట్వీట్లో ఏముందంటే ‘ఉత్తరాంధ్ర ఉతికారేసింది..తూర్పు రాయలసీమ తుక్కు రేగ్గొట్టింది..పశ్చిమ రాయలసీమ పడుకోబెట్టింది..ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్టయ్యింది..జై తెలుగుదేశం..సైకో పాలన పోవాలి..సైకిల్ పాలన రావాలి’.

ఈ ట్విట్‌తోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటా ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థ‌మవుతోంది. ఇంతగా ఎందుకు రెచ్చిపోతున్నారంటే తనను వైసీపీలోకి ఎంటర్ కానీయకుండా అడ్డుకున్నారనే మంట బాగా ఉన్నట్లుంది. అందుకనే వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చిరంజీవిరావు తరపున గంటా బాగా తిరిగారట. స్వతహాగానే బలమైన వ్యక్తి అయిన చిరంజీవి విజయంలో కాపు ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసిందని సమాచారం.

ఉత్తరాంధ్రలో ఉన్న కాపు ప్రముఖులను, కాపు యూత్ సెక్షన్లను గంటా బాగా మ్యానేజ్ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ యాక్టివ్‌గా ఉండే కాపులను పార్టీకి అనుకూలంగా ఓట్లేసేట్లు గంటా ఒప్పించారని వినబడుతోంది. మూడు జిల్లాల్లోనూ చిరంజీవితో పాటు గంటా కూడా బాగా తిరిగారట. అభ్యర్థి కూడా కాపు సామాజికవర్గం అవ్వటంతో గంటా రెచ్చిపోయారట. ఎందుకంటే పార్టీలోని తన ప్రత్యర్థుల‌ నోళ్ళు మూయించేందుకు ఈ ఎన్నికను గంటా వేదికగా ఉపయోగించుకున్నట్లు అర్థ‌మవుతోంది. ఫలితం కూడా సానుకూలంగా రావటంతో ఇప్పుడు గంటా బాగా రెచ్చిపోతున్నారు.

First Published:  20 March 2023 5:21 AM GMT
Next Story