Telugu Global
Andhra Pradesh

కారు ప్రమాదంలో నలుగురు మృతి

శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు రామాపురం మండలంలోని గువ్వలచెరువులో పాలకోవా తినేందుకు కడప నుంచి కారులో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున రామాపురం జాతీయరహదారి మీదుగా కడపకు తిరుగుప్ర‌యాణ‌మ‌య్యారు.

కారు ప్రమాదంలో నలుగురు మృతి
X

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. మరొక‌రికి తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన పూజారి ఆంజనేయులు నాయక్‌ (28), పఠాన్‌ అఫ్రోజ్‌ అలీఖాన్‌ (26), ఎం.జితేంద్రకుమార్‌ (24), షేక్‌ అలీం (35), షేక్‌ ఖాదర్‌ బాషా (19) స్నేహితులు. వీరంతా శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు రామాపురం మండలంలోని గువ్వలచెరువులో పాలకోవా తినేందుకు కడప నుంచి కారులో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున రామాపురం జాతీయరహదారి మీదుగా కడపకు తిరుగుప్ర‌యాణ‌మ‌య్యారు.

వేగంగా వెళుతున్న వీరి కారు అదుపుతప్పి ముందు వెళుతున్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆంజనేయులు, అలీఖాన్, జితేంద్ర, అలీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఖాదర్‌ బాషా తీవ్ర గాయాలపాలవగా, అతన్ని పోలీసులు రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్కిరెడ్డిపల్లె సీఐ జీవన గంగనాథబాబు తెలిపారు.

First Published:  7 July 2024 4:21 AM GMT
Next Story