Telugu Global
Andhra Pradesh

కాంగ్రెస్‌లో చేర‌నున్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి

చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీలోకి రావ‌డంతో సీన్ మారిపోయింది. త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం బ‌ల‌రాం వైసీపీలో చేరారు. అప్పుడు మాట ఇచ్చిన‌ట్లుగా బ‌ల‌రాం కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు చీరాల వైసీపీ టికెటిచ్చారు జ‌గ‌న్‌.

కాంగ్రెస్‌లో చేర‌నున్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి
X

చీరాల మాజీ ఎమ్మెల్యే, ఇటీవ‌లే వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త‌న రాజ‌కీయ ప‌య‌న‌మేటో తేల్చేశారు. కాంగ్రెస్‌లో చేర‌బోతున్న‌ట్లు త‌న స్వ‌గృహంలో త‌న అనుచ‌రులు, శ్రేయోభిలాషుల‌తో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మావేశంలో ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో చీరాల‌లో ష‌ర్మిల‌ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

చీరాల టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో వైసీపీకి రాజీనామా

గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి క‌ర‌ణం బ‌ల‌రాం చేతిలో ఓడిపోయారు. రాష్ట్రమంతా వైసీపీ ప్ర‌భంజ‌నం ఉన్నా, చీరాల‌లో ఓడిపోయినా జ‌గ‌న్ ఆయ‌న‌కు గౌర‌వం ఇస్తూనే వ‌చ్చారు. మంగ‌ళ‌గిరిలో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్స‌వాన్ని కూడా జ‌గ‌న్ ఆమంచి చేయి ప‌ట్టుకుని చేయించ‌డం ఆయ‌న‌కు వైసీపీలో ఇచ్చిన ప్రాధాన్యానికి నిద‌ర్శ‌నం.

బ‌ల‌రాం రాక‌తో మారిన సీన్

చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం వైసీపీలోకి రావ‌డంతో సీన్ మారిపోయింది. త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం బ‌ల‌రాం వైసీపీలో చేరారు. అప్పుడు మాట ఇచ్చిన‌ట్లుగా బ‌ల‌రాం కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు చీరాల వైసీపీ టికెటిచ్చారు జ‌గ‌న్‌. ప్ర‌త్యామ్నాయంగా అంత‌కు ముందే ఆమంచిని ప‌ర్చూరుకు పంపారు. చీరాల‌తో పోల్చితే ప‌ర్చూరులో ఆమంచి సామాజిక‌వ‌ర్గ‌మైన కాపుల ఓట్లు ఎక్కువ‌. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం ప‌ర్చూరుతోపాటు చిన‌గంజాం, ఇంకొల్లు మండ‌లాల్లోనూ కాపుల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉండ‌టంతో ఇక్క‌డి నుంచి అయితే ఆమంచికి విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని జ‌గ‌న్ భావించారు.

చివ‌రికి కాంగ్రెస్ గూటికే

అయితే కావాల‌నే త‌న‌ను చీరాల‌కు దూరం పెడుతున్నార‌ని భావించిన ఆమంచి వైసీపీకి రాజీనామా చేసి బ‌య‌టికొచ్చారు. అంత‌కు ముందు టీడీపీలో ఉన్నా త‌న‌ను పెద్ద‌గా పట్టించుకోలేద‌ని భావించిన ఆమంచి చివ‌రికి త‌న మాతృ పార్టీ కాంగ్రెస్‌లోకే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

First Published:  9 April 2024 2:11 PM GMT
Next Story