Telugu Global
Andhra Pradesh

చెప్పులేముంది ప్రొడ్యూసర్లు కొనిస్తారు.. సింబల్ పోయింది చూస్కో..

పవన్ చేసిన కామెంట్లకు తాజాగా నాని స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పులు పోతే ఏముంది పవన్.. ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు.. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది చూస్కో అంటూ ఎద్దేవా చేశారు.

చెప్పులేముంది ప్రొడ్యూసర్లు కొనిస్తారు.. సింబల్ పోయింది చూస్కో..
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీమంత్రి పేర్ని నాని మధ్య నిత్యం మాటల దాడి జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఏ విమర్శ చేసినా దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడంలో నాని ముందుంటారు. కొన్ని నెలల కిందట పవన్ వైసీపీ పాలనను విమర్శిస్తూ తనను అసభ్య పదజాలంతో దూషించే నాయకులను చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి మరీ మాట్లాడారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టగానే మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని రెండు చెప్పులు చూపుతూ పవన్ పై విమర్శలు చేశారు. నాని వ్యాఖ్యలకు కౌంటర్ గా మళ్లీ పవన్ కూడా స్పందించారు. 'నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు. మీకు కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం గుడిలో నా చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుంది' అని పవన్ వెటకారంగా మాట్లాడారు.

పవన్ చేసిన కామెంట్లకు తాజాగా నాని స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెప్పులు పోతే ఏముంది పవన్.. ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు.. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది చూస్కో అంటూ ఎద్దేవా చేశారు.

'అక్టోబర్ 18 వ తేదీన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళా. అక్కడ ఎవడో నా చెప్పు కొట్టేశాడు. ఎదురుగా పవన్ కళ్యాణ్ కార్యాలయం ఉందని ఆయన్ను అనుమానించలేముగా. నా ఒక చెప్పు పోయి తొమ్మిది నెలలు అవుతోంది. ఒక చెప్పు పట్టుకెళ్ళినోడు దాంతో ఏం చేసుకుంటాడో ఏమో..? చెప్పులు పోయిన మూడు రోజుల నుంచి పవన్ కంగారు పడుతున్నాడు. చెప్పులు పోతే ఏముంది.. ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూస్కో' అంటూ పేర్ని నాని పవన్ కు కౌంటర్ ఇచ్చారు.

First Published:  17 Jun 2023 1:46 PM GMT
Next Story