Telugu Global
Andhra Pradesh

పవన్‌ కల్యాణ్‌కు పేర్ని నాని కౌంటర్

జిల్లాలో మాత్రమే బదిలీలు ఉండే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని మీ తండ్రి రాష్ట్రమంతా ఎలా చేశారో అర్థం కావడం లేదని నాని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. నువ్వు ఒకటి ఇస్తే మేం వంద ఇస్తాం నాని కౌంటర్ ఇచ్చారు.

పవన్‌ కల్యాణ్‌కు పేర్ని నాని కౌంటర్
X

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. పవన్‌ డైలాగులకు వైసీపీలో బాల కార్యకర్త కూడా బెదరడన్నారు. అమరావతి ఒక కుల రాజధాని అని పవన్‌ అనలేదా? అని ప్రశ్నించారు. డిక్కి బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడకొట్టినట్టు అమరావతి యాత్ర ఉత్తరాంధ్ర వైపు వస్తుంటే అక్కడి ప్రజలకు మండకుండా ఉంటుందా అని నాని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో దాడి చేయాలన్న ఉద్దేశంతోనే జనసేన కార్యకర్తలు జెండాలకు పెద్దపెద్ద కర్రలు కట్టారన్నారు. దాడి తప్పు అని చెప్పే సభ్యత కూడా పవన్‌కు లేకుండా పోయిందన్నారు.

ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది త్వరగా వెళ్లండి అని ఐపీఎస్ చెబితే తప్పా? అని నాని ప్రశ్నించారు. ఏం పదవి ఉందని నీకు ప్రివిలేజ్? అని నిలదీశారు. స్లోగన్లు ఇచ్చామంటున్నారు.. స్లోగన్‌లకే తలలు పగులుతాయా? అని ఫైర్ అయ్యారు. జిల్లాలో మాత్రమే బదిలీలు ఉండే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని మీ తండ్రి రాష్ట్రమంతా ఎలా చేశారో అర్థం కావడం లేదని నాని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. నువ్వు ఒకటి ఇస్తే మేం వంద ఇస్తాం నాని కౌంటర్ ఇచ్చారు.

జనసేన కార్యకర్తల బెయిల్ కోసం లాయర్లను చంద్రబాబే నియమిస్తారని అదేమీ పెద్ద విషయం కాదన్నారు నాని. వైసీపీతో పోరాటానికి ఇక్కడే ఉంటా అని పవన్ చెబుతున్నారని.. తాము కూడా అందుకు సిద్ధమని ప్రకటించారు.

First Published:  17 Oct 2022 2:34 PM GMT
Next Story