Telugu Global
Andhra Pradesh

మాధవ్ వీడియోపై కొడాలి మార్క్ పంచ్ లు..

తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసొచ్చినా వైసీపీని, జగన్ ని ఏమీ చేయలేరని అన్నారు కొడాలి నాని. వీడియో వ్యవహారంలో కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు. ఎవరిపై కేసులు పెట్టాలో చెప్పాలని అడిగారు.

మాధవ్ వీడియోపై కొడాలి మార్క్ పంచ్ లు..
X

ఇన్నాళ్లూ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో కొడాలి నాని మార్క్ పంచ్ లు మిస్ అయ్యాయి. అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ తర్వాత, ఈ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చిందనుకున్న సందర్భంలో తనదైన స్టైల్ లో ఆ వీడియోపై కామెంట్ చేశారు మాజీ మంత్రి నాని. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెప్తున్నా.. అది మాధవ్‌ దే అని టీడీపీ వాళ్లు, ఎల్లో మీడియా అంటోందని మండిపడ్డారు. మాధవ్‌ ది పట్టుకుని ఎందుకు వేలాడతారంటూ సెటైర్లు వేశారు నాని. టీడీపీ వాళ్లు మాధవ్‌ ది పట్టుకుని వేలాడినా వైసీపీని, జగన్‌ ని ఇంచ్ కూడా కదల్చలేరన్నారు.

తల ఆయనిదే, బాడీ టీడీపీ వాళ్లది..

వీడియోలో కనిపిస్తోంది టీడీపీ నేతల శరీరాలు అని.. వాటికి మొహం మాత్రం వైసీపీ నేతలది పెడుతున్నారని అన్నారు కొడాలి నాని. మాధవ్ కి ఉన్నది ఒకటేనా కాదా అని డిబేట్లు పెడుతున్నారని, టీవీ డిబేట్లలో కూడా దారుణమైన చర్చలు జరుగుతున్నాయని అన్నారు నాని. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఏది ఎవడిదో అనే విషయంపైనే టీడీపీ నేతలు దృష్టి పెట్టారని చెప్పారు.

తెలుగు వృద్ధులు వచ్చినా ఏం చేయలేరు..

తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసొచ్చినా వైసీపీని, జగన్ ని ఏమీ చేయలేరని అన్నారు కొడాలి నాని. వీడియో వ్యవహారంలో కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు. ఎవరిపై కేసులు పెట్టాలో చెప్పాలని అడిగారు. ఫేక్ వీడియో తయారుచేసి దానిని అప్‌ లోడ్ చేసే ధైర్యం కూడా చంద్రబాబు, లోకేష్‌ కు లేదని ఎద్దేవా చేశారు. మొత్తమ్మీద మాధవ్ వీడియో వ్యవహారంలో కాస్త లేట్ గా స్పందించినా, ఘాటుగా మాట్లాడారు నాని. ఏది ఎవరిదో తెలుసుకుని, లింగ నిర్ధారణ చేసి టీడీపీ వాళ్లు ఐడీ కార్డ్ లు ముద్రిస్తున్నారా అంటూ మండిపడ్డారు.

Next Story