Telugu Global
Andhra Pradesh

‘ఈనాడు’పై పరువు నష్టం దావా.. - స్పష్టం చేసిన మాజీ మంత్రి బాలినేని

చెవిరెడ్డి భాస్కరరెడ్డికి క్రాస్‌ ఓటింగ్‌ చేయిస్తానని టీడీపీ వాళ్లు ఎవరో ఊరు.. పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. దానిపై ఈనాడు పత్రికలో కథనంగా రాస్తారా.. అసలు ఈనాడు యాజమాన్యానికి సిగ్గుందా? అంటూ బాలినేని నిలదీశారు.

‘ఈనాడు’పై పరువు నష్టం దావా.. - స్పష్టం చేసిన మాజీ మంత్రి బాలినేని
X

‘ఈనాడు’పై పరువు నష్టం దావా వేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పచ్చ పత్రికల్లో వెధవ రాతలు, పిచ్చి రాతలు రాస్తున్నారు.. ఎవరో వెధవలు పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. దాన్నే ఈనాడు పేపర్లో రాస్తారా అని నిలదీశారు. ‘ఈనాడు’కు అసలు కొంచెం అయినా విలువలున్నాయా అని ఆయన మండిపడ్డారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలసి చేపట్టిన బాలినేని.. ఈ సందర్భంగా ఈనాడు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డికి క్రాస్‌ ఓటింగ్‌ చేయిస్తానని టీడీపీ వాళ్లు ఎవరో ఊరు.. పేరు లేకుండా కరపత్రాలు వేస్తే.. దానిపై ఈనాడు పత్రికలో కథనంగా రాస్తారా.. అసలు ఈనాడు యాజమాన్యానికి సిగ్గుందా? అంటూ బాలినేని నిలదీశారు. అందుకే ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు తేల్చిచెప్పారు. ఇక మరో ఎల్లోమీడియా పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రారంభించిన షాదీఖానానే రెండోసారి ప్రారంభిస్తున్నానని రాశారని, ఇవేం రాతలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వస్తే వాస్తవాలు తేలుస్తామన్నారు.

ఇదే కార్యక్రమంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. నలుగురు చీఫ్‌ సెక్రటరీలు వచ్చి, సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలిస్తే దొంగ పట్టాలు అంటున్నారంటే.. టీడీపీ నేతలకు మతిపోయిందంటూ మండిపడ్డారు. వాసన్నకు, తనకు అవినాభావ సంబంధం ఉందని చెవిరెడ్డి తెలిపారు.

First Published:  6 March 2024 4:06 AM GMT
Next Story