Telugu Global
Andhra Pradesh

కొత్తపెళ్లి జంట సహా.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్‌ తీవ్రంగా గాయపడి స్పాట్‌లోనే చనిపోయారు.

కొత్తపెళ్లి జంట సహా.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
X

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. వీరిలో కొత్తగా పెళ్లయిన జంట కూడా ఉంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా నల్లగట్ల హైవేపై లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్‌ తీవ్రంగా గాయపడి స్పాట్‌లోనే చనిపోయారు.

ఫిబ్రవరి 29న బాల కిరణ్‌కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో పెళ్లి చేశారు. ఈనెల 3న శామీర్‌పేటలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. 4న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

First Published:  6 March 2024 4:24 AM GMT
Next Story