ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది.
BY Vamshi Kotas13 March 2025 8:47 PM IST

X
Vamshi Kotas Updated On: 13 March 2025 8:47 PM IST
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాలకు మొత్తం ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ సాయంత్రంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న కొణిదల నాగేంద్రరావు (జనసేన), బీద రవిచంద్ర(టీడీపీ), బి.తిరుమల నాయుడు(టీడీపీ), కావలి గ్రీష్మ ప్రసాద్ (టీడీపీ), సోము వీర్రాజు (బీజేపీ) వీరంతా ఏకగ్రీవం అయినట్టు రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
Next Story