Telugu Global
Andhra Pradesh

ఏపీలో కరోనాతో తొలి మరణం

ఏపీలో కొత్తగా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుంచి ఈ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఏపీలో కరోనాతో తొలి మరణం
X

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో తొలి మరణం నమోదైంది. ఈనెల 24న KGHలో కరోనాతో జాయిన్ అయిన సోమకళ అనే మహిళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29 మంది యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో విశాఖ నుంచే 20మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

100 ఆక్సిజన్ సిలిండర్లు, 40 వెంటిలేటర్ బెడ్లు

ఏపీలో కొత్తగా ఐదుగురు కరోనా బారిన పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుంచి ఈ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విశాఖలో కేసుల తీవ్రత పెరగడంతో KGHలో వంద ఆక్సిజన్ సిలిండర్లు, 40 వెంటిలేటర్ బెడ్లు సిద్ధం చేశారు అధికారులు.

తెలంగాణలో రెండు JN-1 వేరియంట్ కేసులు

తెలంగాణలోనూ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24గంటల్లో 989 మందికి కరోనా టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో హైదరాబాద్‌ నుంచే 9 మంది ఉండగా.. కరీంనగర్‌లో ఒక కేసు నమోదైంది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 55కు పెరిగింది. JN-1 న్యూ వేరియంట్ కేసులు రెండు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని అంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. లేదంటే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

First Published:  26 Dec 2023 7:17 AM GMT
Next Story