Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ టెన్షన్‌.. కంటిన్యూస్‌

మూడో జాబితా విషయంలోనూ పార్టీ అధిష్టానం తన వద్ద ఉన్న పూర్తి సమాచారం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశాలు లేవనుకునేచోట ఎంతటివారైనా నో చెప్పేస్తున్నట్టుగా సమాచారం.

వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌ టెన్షన్‌.. కంటిన్యూస్‌
X

వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఇప్పటికే రెండు లిస్ట్‌లు వచ్చాయి. ఇక మూడోదే లాస్ట్‌ అని.. ఆ తర్వాత మార్పులు, చేర్పులు దాదాపు ఉండవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడో లిస్ట్‌ కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. బుధవారం సాయంత్రానికే ఈ జాబితా విడుదల కావడం గ్యారంటీ అనుకున్న తరుణంలో విడుద‌ల‌ వాయిదా పడింది. కొన్ని నియోజకవర్గాలపై మరింత కసరత్తు అవసరమని వైసీపీ అధిష్టానం భావిస్తున్న తరుణంలో జాబితా విడుదలను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. రెండ్రోజుల్లో దీనిని కచ్చితంగా విడుదల చేస్తారని సమాచారం.

11 మందితో మొదటి జాబితా.. 27 మందితో రెండో జాబితా విడుదల చేసిన వైసీపీ.. మూడో జాబితాలో దాదాపు 30 మంది ఇన్‌చార్జిల పేర్లను ప్రకటించనుందని తెలుస్తోంది. ఆ తర్వాత మరో లిస్ట్‌ ఉండదని.. మిగిలినవారంతా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం కావాలని సమాచారం. ఇక చివరి జాబితాలో ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణాతో పాటు పలు జిల్లాల్లోని మరికొన్ని ముఖ్య నియోజకవర్గాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మూడో జాబితా విషయంలోనూ పార్టీ అధిష్టానం తన వద్ద ఉన్న పూర్తి సమాచారం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశాలు లేవనుకునేచోట ఎంతటివారైనా నో చెప్పేస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో ఆ పార్టీ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు. మూడో జాబితాలో మంత్రులు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వారి విషయంలో అధిష్టానం ఏం చెబుతోంది.. వారికి ఎలాంటి హామీలు ఇస్తోందనేది మాత్రం బయటికి రావడం లేదు. సంక్రాంతి పండుగకు ముందే మార్పులు, చేర్పులు పూర్తిచేయాలనే అభిప్రాయంతో ఉన్న అధిష్టానం ఆ దిశగానే ముందుకు సాగుతోంది.

First Published:  11 Jan 2024 5:08 AM GMT
Next Story