Telugu Global
Andhra Pradesh

దేవినేని ఉమాకు ఆర్జీవీ కౌంటర్‌

ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను టార్గెట్ చేశారు ఆర్జీవీ. ట్విట్టర్‌ వేదికగా ఆయనపై నిప్పులు చెరిగారు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్‌ తెలుగుదేశం అన్నట్లుగా పరిస్థితి మారింది.

దేవినేని ఉమాకు ఆర్జీవీ కౌంటర్‌
X

సినీ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావును ఉద్దేశించి ఓ ఫొటోను పోస్టు చేశాడు. చేతిలో మిక్కిమౌస్‌ బొమ్మను పట్టుకున్న ఫొటోను పోస్టు చేసిన ఆర్జీవీ.. దేవినేని ఉమా ట్విట్టర్‌ ప్రొఫైల్‌ను ట్యాగ్‌ చేశాడు. అక్కడితో ఆగకుండా చివర్లో ఓ కిస్ ఎమోజీని పెట్టాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణను టార్గెట్ చేశారు ఆర్జీవీ. ట్విట్టర్‌ వేదికగా ఆయనపై నిప్పులు చెరిగారు. దీంతో ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్‌ తెలుగుదేశం అన్నట్లుగా పరిస్థితి మారింది.


అంతకుముందు ఆర్జీవీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు దేవినేని ఉమా. రాంగోపాల్ వర్మ ఓ దగుల్బాజీ, దుర్మార్గుడు, దౌర్భాగ్యుడంటూ తిట్ల పురాణం అందుకున్నారు. RGV లాంటి వాళ్లు ఉండబట్టే ఆంధ్రప్రదేశ్‌ నాశనం అవుతుందన్నారు. సినిమా ద్వారా ప్రజలకు వాస్తవం చెప్పరా దరిద్రుడా.. అంటూ ఆర్జీవీపై రెచ్చిపోయారు. చంద్రబాబు కష్టం, పట్టిసీమ గొప్పతనంపై సినిమా తీయాలంటూ ఆర్జీవీకి సూచించారు ఉమా. ఎన్నికల్లో గెలవడానికే సీఎం జగన్ ఆర్జీవీతో సినిమాలు తీయిస్తున్నాడని ఆరోపించారు.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహం అనే సినిమాను కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిస్తున్నారు రామ్‌ గోపాల్‌ వర్మ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌, టీజర్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుత ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఎలాంటి కుట్రలు జరిగాయి, జగన్‌ సీఎం అయ్యాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఆర్జీవీ సైతం ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు.

First Published:  13 Aug 2023 10:17 AM GMT
Next Story