Telugu Global
Andhra Pradesh

కూతురిని క‌డ‌తేర్చి.. సోష‌ల్ మీడియాలో సెల్ఫీ వీడియో.. - విశాఖ‌లో క‌న్న‌తండ్రి ఘాతుకం

విశాఖ‌ప‌ట్నంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. క‌న్న‌తండ్రే కూతురిని హ‌త‌మార్చాడు. ఆపై త‌న కూతురిని ఎందుకు చంపాల్సి వ‌చ్చిందో వివ‌రిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. దానిని ఏకంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కూతురిని క‌డ‌తేర్చి.. సోష‌ల్ మీడియాలో సెల్ఫీ వీడియో.. - విశాఖ‌లో క‌న్న‌తండ్రి ఘాతుకం
X

భార్య‌.. పిల్ల‌ల చిన్న‌ప్పుడే కుటుంబాన్ని వ‌దిలేసి వెళ్లిపోయింది.. పెంచి పెద్ద చేసిన పెద్ద కుమార్తె.. ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది.. ఉన్న చిన్న కుమార్తెనైనా బాగా చ‌దివించాల‌నుకుంటే.. ఆమె కూడా ప్రేమ వ్య‌వ‌హారంలో ప‌డింది. న‌చ్చ‌జెప్పినా విన‌క‌పోవ‌డంతో.. తండ్రి ఘాతుకానికి దిగాడు. ఆమెను చంపేశాడు.

విశాఖ‌ప‌ట్నంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. క‌న్న‌తండ్రే కూతురిని హ‌త‌మార్చాడు. ఆపై త‌న కూతురిని ఎందుకు చంపాల్సి వ‌చ్చిందో వివ‌రిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. దానిని ఏకంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శుక్ర‌వారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఇంత‌కీ ఈ హ‌త్య‌కు కారణం.. ప్రేమ వ్య‌వ‌హారం. ఆ వివ‌రాలేంటో తెలుసుకుందాం..

వీరి కుటుంబం విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్ డౌన్‌లోని రెల్లి వీధిలో నివ‌సిస్తోంది. తండ్రి వ‌డ్డాది వ‌ర‌ప్ర‌సాద్ కేజీహెచ్ మ‌హా ప్ర‌స్థానం వ్యాన్ డ్రైవ‌ర్‌. అత‌నికి ఇద్ద‌రు కుమార్తెలు. అత‌ని భార్య వీరిని వ‌దిలేసి వెళ్లిపోయింది. దీంతో చిన్న‌ప్ప‌టి నుంచీ తండ్రే వారిని పెంచి పెద్ద చేశాడు.

ఆ త‌ర్వాత పెద్ద కుమార్తె ఒక యువ‌కుడిని ప్రేమించి, అత‌నితో వెళ్లిపోయింది. దీంతో కుంగిపోయిన తండ్రి ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్న కుమార్తె నిఖిత‌శ్రీ (16) ని బాగా చ‌దివించాల‌ని ఆశ ప‌డ్డాడు. ఆమెకు ఆత్మ ర‌క్ష‌ణార్థం క‌రాటే కూడా నేర్పించాడు.

అయితే ఆమె కూడా ఒక యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింది. దీనిని గ్ర‌హించిన తండ్రి వ‌రప్ర‌సాద్ అత‌నితో తిర‌గొద్ద‌ని న‌చ్చ‌జెప్పాడు. అయినా ఆమె త‌న ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగించ‌డంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన తండ్రి శుక్ర‌వారం ఆమెను తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి హ‌త‌మార్చాడు. వ‌రప్ర‌సాద్ త‌ల్లి వ‌ర్ధంతి నాడే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని నిందితుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియాలో చెప్పాడు.

కూతురిని చంపిన అనంత‌రం అత‌ను నేరుగా పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి లొంగిపోయిన‌ట్టు స‌మాచారం. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి త‌ర‌లించారు. అయితే పోలీసులు మాత్రం నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని చెబుతున్నారు.

Next Story