Telugu Global
Andhra Pradesh

హిందుత్వ దొంగబాబు నాయుడు..!

ముస్లింల ప్రయోజనాలు కాపాడతాను అని మాట ఇస్తూనే, నరేంద్రమోడీ పాదాల మీద పడుతుంటాడు. ఈ చిల్లర రాజకీయ దొంగని నాలుగైదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చిత్తుగా ఓడించారు.

హిందుత్వ దొంగబాబు నాయుడు..!
X

అటు సీపీఎం రాఘవులూ, ఇటు సీపీఐ నారాయణా.. కుడిఎడమల డాల్‌ కత్తులు మెరయగ.. కామ్రేడ్‌ చంద్రబాబు నాయుడు మెరిసిపోతుంటారు. ఒకప్పుడు అటు లాల్‌ జాన్‌ బాషా, ఇటు సలావుద్దీన్‌ ఓవైసీ.. అడుగులు కలిపి నడిచేవాడు ప్యూర్‌ సెక్యులర్‌ చంద్రబాబు. అటు భజనా చౌదరి, ఇటు వెంకయ్య నాయుడూ.. లోపాయకారీ మంతనాలతో ముసిముసిగా నవ్వేవాడు మన చంద్రబాబే. మామ ఎన్టీఆర్‌ బంటుగా, గురువు రామోజీరావు ఏజెంట్‌గా ఏకకాలంలో నటించి మెప్పించగల నారా జిత్తులమారి చంద్రబాబుని ఏమని పొగడగలం..? కాషాయం కప్పుకున్న ఆ విషపురుగే.. రూమాటోపీ పెడతాడు.. మసీదుల్లో ప్రార్థనలు చేస్తాడు.. ముస్లింలు నా ఆరోప్రాణం అంటాడు. మర్నాడే నిర్లజ్జగా, నిష్పూచీగా అయోధ్యలో అడుగుపెడతాడు. శ్రీరామ భక్తాగ్రేసరునిగా కొత్త అవతారం ఎత్తుతాడు. అధికారంలో దేనికైనా తెగిస్తాడు. నమ్ముకున్న ముస్లింల గొంతని హిందుత్వతో కోస్తాడు.

రామభక్తి కాదు, అది రాజకీయ యుక్తి అని దొంగమాటలు చెబుతాడు. ముస్లింల ప్రయోజనాలు కాపాడతాను అని మాట ఇస్తూనే, నరేంద్రమోడీ పాదాల మీద పడుతుంటాడు. ఈ చిల్లర రాజకీయ దొంగని నాలుగైదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చిత్తుగా ఓడించారు. పదవీ దాహంతో పరితపించిపోతున్న ఈ రాజకీయ బందిపోటు, ముస్లింల ప్రయోజనాలను కాళ్లతో తొక్కుకుంటూ వెళ్లి అయోధ్య రాముడిని మొక్కుతున్నాడు.

ఇది ద్రోహం..! ఇది బరితెగింపు. ఇది నీచత్వానికి చివరిమెట్టు. ఎలాగైనా జగన్మోహన్‌రెడ్డిని ఓడించాలన్న దుగ్ధలో కాపుల్ని కొన్నాడు. పేద ముస్లింల సంక్షేమాన్నీ, ముస్లిం పెద్దల ఆదరణనీ, సహృదయతనీ ఒక హిందూ తీవ్రవాది పాదాల దగ్గర తాకట్టు పెట్టాడు.

ఈ దురాగతాన్ని ముస్లిం సమాజం సహించదు. ఆ శ్రీరామచంద్రుడు కూడా చంద్రబాబును క్షమించడు.

First Published:  22 Jan 2024 7:36 AM GMT
Next Story