Telugu Global
Andhra Pradesh

మెగా విరాళం.. శ్రీవారి భక్తులకోసం 10 ఎలక్ట్రిక్ బస్సులు

ఒలెక్ట్రా సంస్థకు చెందిన ఈ బస్సు ఒక్కొకటి కోటీ 80 లక్షల విలువ చేస్తుంది. మొత్తం 18కోట్ల రూపాయలు వ్యయం చేసే 10 ఎలక్ట్రిక్ బస్సులను ఆ సంస్థ టీటీడీకి విరాళంగా అందించింది.

మెగా విరాళం.. శ్రీవారి భక్తులకోసం 10 ఎలక్ట్రిక్ బస్సులు
X

మేఘా ఇంజినీరింగ్ సంస్థ తిరుమల శ్రీవారి భక్తులకోసం మెగా విరాళాన్ని అందించింది. మేఘా సారథ్యంలోని ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ సంస్థ 10 బస్సులను టీటీడీకి అందించింది. తిరుమల కొండపై తిరిగే వీటికి ధర్మ రథాలు అనే పేరు పెట్టారు. వీటిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

తిరుమలలో భక్తులు ఒకచోటనుంచి మరొకచోటకు వెళ్లేందుకు, శ్రీవారి సేవకులు, సిబ్బంది రవాణా కోసం టీటీడీ ఇప్పటి వరకూ డీజిల్ బస్సులు నడుపుతోంది. వీటి స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టారు. వీటి రాకతో తిరుమలను మరింత కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామంటున్నారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.




మొత్తం 18కోట్ల విరాళం..

ఒలెక్ట్రా సంస్థకు చెందిన ఈ బస్సు ఒక్కొకటి కోటీ 80 లక్షల విలువ చేస్తుంది. మొత్తం 18కోట్ల రూపాయలు వ్యయం చేసే 10 ఎలక్ట్రిక్ బస్సులను ఆ సంస్థ టీటీడీకి విరాళంగా అందించింది.

తిరుమలలో ఏడాది క్రితం నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అమలులో ఉంది. అధికారులు సిబ్బందికి విధి నిర్వహణ కోసం కోసం ఎలక్ట్రిక్ కార్లను కేటాయించారు. ఆ తర్వాత కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తున్నారు. తిరుపతి-తిరుమల మధ్య భక్తుల ప్రయాణంకోసం 65 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రతిరోజూ నడుపుతోంది. ఇప్పుడు కేవలం కొండపైన యాత్రికుల సౌకర్యం కోసం 10 ఎలక్ట్రిక్ బస్సులు వీటికి జతచేరాయి.

ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. లడ్డూ కౌంటర్లలో ప్లాస్టిక్ రహిత కవర్లు అందిస్తున్నామని, తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిస్థాయిలో నిషేధించామని తెలిపారు. రాబోయే రోజుల్లో తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

First Published:  27 March 2023 12:07 PM GMT
Next Story