Telugu Global
Andhra Pradesh

కేసీఆర్‌ మూడోసారి సీఎం అవుతాడ‌న్నావ్‌.. ఏమైంది పీకే..?

చంద్రబాబు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒకొక్క‌రిని రంగంలోకి దించుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రశాంత్‌ కిశోర్‌ను రంగంలోకి దింపి ఉంటారు.

కేసీఆర్‌ మూడోసారి సీఎం అవుతాడ‌న్నావ్‌.. ఏమైంది పీకే..?
X

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచి, మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమి పాలై, కేసీఆర్‌ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓడిపోతారని ఆయన తాజాగా అన్నారు. ఆయన ప్రస్తుతం చెప్పిన మాట కూడా తప్పయ్యే అవకాశాలున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌ చిలకజోస్యం చెప్పారనే అనుకోవాలి. ఎన్నికల కోసం ఏ పార్టీకీ పనిచేయబోనని ఆయన గతంలో ఓసారి చెప్పారు. కాబట్టి ఆయన సర్వే చేయించడం మాట అటుంచి, శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పిన మాట కాదని అనుకోవచ్చు.

ప్రశాంత్‌ కిశోర్‌కు, చంద్రబాబుకు మధ్య ఒక రహస్య అవగాహన ఉన్నట్లు అనుకోవాల్సి వస్తోంది. గతంలో సీఎం రమేష్‌ సమకూర్చిన ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి చంద్రబాబును కలిసినప్పుడే ఇరువురికి మధ్య ఒక అవగాహన కుదిరిందని చెప్పవచ్చు. ఒక జట్టుతో కలిసి పనిచేసినప్పుడు లభించే పీడ్‌బ్యాక్‌ ప్రశాంత్‌ కిశోర్‌కు ఇప్పుడు లభించే అవకాశం లేదు. ఫీడ్‌ బ్యాక్‌ లేకుండా ఆయన గాలివాటం ప్రకటన చేశారని అనుకోవచ్చు. ఆయనేదో లాజిక్‌ చెప్పారు గానీ అది ఇక్కడ పనిచేసేది కాదు.

అయినా ప్రశాంత్‌ కిశోర్‌ అన్ని చోట్లా ఫలితం సాధించిన దాఖలాలు కూడా లేవు. తాను పనిచేసిన పార్టీలు విజయం సాధించిన సందర్భాలకు ఎక్కువ ప్రచారం కల్పించుకున్నారు. చంద్రబాబు పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒకొక్క‌రిని రంగంలోకి దించుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రశాంత్‌ కిశోర్‌ను రంగంలోకి దింపి ఉంటారు.

అంతా అయిపోయారు.. ఇప్పుడు..

చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. వైఎస్‌ జగన్‌ను దెబ్బ తీయడానికి షర్మిలను కాంగ్రెస్‌ తరఫున రంగంలోకి దించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత చేత లాజిక్‌ లేని మాటలు మాట్లాడించారు. ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ను వాడుకుంటున్నారు. జగన్‌ను ఎదుర్కోవడానికి ఆయన ఇంకా ఎంత మందిని రంగంలోకి దించుతారో తెలియదు. మొత్తం మీద, ప్రశాంత్‌ కిశోర్‌ మాటకు విలువ ఉంటుందని ఆయన ఉద్దేశం కావచ్చు. అందుకే, ఇప్పుడు ఆయనను ప్రయోగించినట్లుగా భావిస్తున్నారు.

First Published:  4 March 2024 7:55 AM GMT
Next Story