Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు గురించి పీకే చెప్పింది కరెక్టేనా..?

చంద్రబాబు నైజాన్ని పీకే చెప్పారు. నిజానికి పీకే చెప్పకుండానే జనాలందరికీ చంద్రబాబు గురించి బాగా తెలుసు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

చంద్రబాబు గురించి పీకే చెప్పింది కరెక్టేనా..?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు గురించి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈమధ్యనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నైజం గురించి పీకే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమే అనిపించేట్లుగా ఉన్నాయి. ఇంతకీ చంద్రబాబు గురించి పీకే ఏమి చెప్పారంటే.. అవసరం కోసం చంద్రబాబు అందితే జుట్టు లేకపోతే కాళ్ళుపట్టుకునే రకమన్నారు. తన అవసరం గడుపుకోవటానికి చంద్రబాబు ఎంత స్థాయికైనా దిగజారటానికి వెనకాడరని చెప్పారు.

అసలు చంద్రబాబు గురించి పీకే ఎందుకు ఇలా చెప్పారంటే ఒక ఛానల్ ఇంట‌ర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్న అడిగారు. ఒకప్పుడు తిట్టిన తిట్టుకుండా తిట్టిన చంద్రబాబుతో పనిచేయటానికి ఎలా అంగీకరించారని పీకేని యాంకర్ అడిగారు. దానికి పీకే సమాధానమిస్తూ తాను చంద్రబాబు కోసం పనిచేయటంలేదని స్పష్టంగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి కూడా తాను పనిచేయటం లేదని, తాను లైన్ మార్చుకున్నట్లు చెప్పినా వినకుండా చంద్రబాబు పదేపదే వెంటపడి లోకేష్ ను పంపితే చివరకు వెళ్ళాల్సొచ్చిందన్నారు. అదికూడా చంద్రబాబుకు తనకు మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్ ఒత్తిడి వల్లే అని కూడా చెప్పారు.

ఈ సందర్భంగానే చంద్రబాబు నైజాన్ని పీకే చెప్పారు. నిజానికి పీకే చెప్పకుండానే జనాలందరికీ చంద్రబాబు గురించి బాగా తెలుసు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా సరే బీజేపీతో పొత్తుపెట్టుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నం. ఇందుకోసమే చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇదే అమిత్ కాన్వాయ్ పై రాళ్ళేయించారు. అమిత్ షా పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరేయించారు.

అసెంబ్లీలో, బయటా నరేంద్రమోడీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. భార్యను తరిమేశాడన్నారు, తల్లిని చూసుకోవటం కూడా చేతకాదన్నారు. కుటుంబాన్ని సరిగా చూసుకోలేని మోడీ ఇక దేశాన్ని ఏమి పాలిస్తాడంటు ఏదేదో మాట్లాడారు. ఎప్పుడైతే అధికారం పోయిందో వెంటనే మోడీని కీర్తిస్తూ స్తోత్రాలు మొదలుపెట్టేశారు. మోడీ ఒక దార్శినికుడని, అంతర్జాతీయ స్థాయిలో దేశప్రతిష్టను పెంచాడంటూ పొగుడుతున్నారు. అందుకనే ఇప్పుడు పీకే చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.

First Published:  9 Feb 2024 7:51 AM GMT
Next Story