Telugu Global
Andhra Pradesh

ఓటేయ‌క ముందే వేలిమీద సిరా గుర్తు వేసేస్తున్నార‌న్న‌ది దుష్ప‌చార‌మే.. ఈసీ కార్లిటీ

ఓటు వేశాక వారి చేతిమీద వేసే ఇంకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇండెలిబుల్ ఇంక్ అని చెప్పే ఆ సిరాను కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే త‌యారుచేస్తారు. అది కేవ‌లం ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది.

ఓటేయ‌క ముందే వేలిమీద సిరా గుర్తు వేసేస్తున్నార‌న్న‌ది దుష్ప‌చార‌మే.. ఈసీ కార్లిటీ
X

ప్ర‌త్య‌ర్థి పార్టీ వారు త‌మ‌కు ఓటేయ‌ర‌నుకున్న‌వారికి వేలికి ముందే సిరా గుర్తు పెడుతున్నార‌న్న‌ వార్త‌ల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ కొట్టిపారేసింది. అది దుష్ప్ర‌చార‌మేనంది. అస‌లు చెర‌గ‌ని గుర్తు వేసే ఆ సిరా (ఇండెలిబుల్ ఇంక్‌) కేవ‌లం ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ వ‌ద్ద మాత్ర‌మే ఉంటుంద‌ని తేల్చిచెప్పింది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముకేష్‌కుమార్ మీనా క్లారిటీ ఇస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసినా, దాని మీద దుష్ప్ర‌చారం చేసినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఓటేయ‌క ముందే సిరా గుర్తు వేసే కుట్ర అన్న నాగ‌బాబు

వైసీపీ నాయ‌కులు పిఠాపురంలో ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచ‌డంతోపాటు ఓట‌ర్ల చేతికి ఇంకు మార్కు వేసేస్తున్నార‌ని, తద్వారా వారు ఓటేసేందుకు అర్హులు కాకుండా కుట్ర ప‌న్నుతున్నార‌ని జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబు ఆరోపించారు. దీనిపై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయ‌బోతున్నామంటూ నిన్న ఒక వీడియో సందేశం విడుద‌ల చేశారు.

అంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు?

ఓటు వేశాక వారి చేతిమీద వేసే ఇంకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇండెలిబుల్ ఇంక్ అని చెప్పే ఆ సిరాను కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే త‌యారుచేస్తారు. అది కేవ‌లం ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. పోలింగ్ ఆఫీస‌ర్ల‌కు ఎన్నిక‌ల‌కు విధుల‌కు వెళ్లేట‌ప్పుడు మాత్ర‌మే ఇస్తారు. అది మార్కెట్లో దొరక‌దు. అయినా ఓటేసే వ‌ర‌కు ఎవ‌రికి వేస్తారో ఓట‌రే ఎవ‌రికీ చెప్ప‌రు. అలాంటిది వాళ్లు ముందే త‌మ‌కు ఓటేయ‌ర‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చేసి, వైసీపీ వాళ్లు ఇంకు మార్కు వేసేస్తున్నార‌న‌డం అర్థం లేని ఆరోప‌ణ క‌దా.. ఇంత చిన్న లాజిక్ నాగ‌బాబు ఎలా మిస్స‌య్యార‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

First Published:  12 May 2024 9:32 AM GMT
Next Story