Telugu Global
Andhra Pradesh

అల్లు అర్జున్‌ VS రామ్‌చరణ్‌.. సోషల్‌మీడియా వార్‌

నంద్యాలకు వచ్చిన పుష్ప ఫేమ్ అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆ జనసందోహం ఓ రకంగా భారీ బహిరంగ సభను తలపించింది.

అల్లు అర్జున్‌ VS రామ్‌చరణ్‌.. సోషల్‌మీడియా వార్‌
X

ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పీక్ స్టేజ్‌కు చేరింది. ఈ క్రమంలోనే మెగా హీరోలు ఎలక్షన్ ప్రచారానికి ఫినిషింగ్ టచ్‌ ఇచ్చారు. కోస్తాంధ్రలో రామ్‌చరణ్‌, సీమలో అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఎన్నికల వేడిని మరింత పెంచారు. రామ్‌చరణ్ తన బాబాయి జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం కోసం రాగా.. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికు సపోర్ట్‌గా నంద్యాలకు వచ్చారు.

ఏపీ ఎలక్షన్ల ప్రచారంలోకి ఈ ఇద్దరు హీరోల ఎంట్రీ సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్‌కు తెరతీసింది. మా హీరోకు క్రేజ్‌ ఎక్కువంటే.. మా హీరోకు క్రేజ్ ఎక్కువని అభిమానులు సోషల్ మీడియాలో ఫైట్‌ చేసుకుంటున్నారు. పిఠాపురం, నంద్యాల, అల్లు అర్జున్ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

నంద్యాలకు వచ్చిన పుష్ప ఫేమ్ అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆ జనసందోహం ఓ రకంగా భారీ బహిరంగ సభను తలపించింది. నంద్యాల రోడ్లు కిక్కిరిసిపోయాయి. అల్లు అర్జున్‌తో పోల్చితే రామ్‌చరణ్‌ కోసం వచ్చిన ఫ్యాన్స్‌, జనం తక్కువే. ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్‌చరణ్‌, పవన్‌కల్యాణ్‌ కంటే ఎక్కువగా క్రౌడ్‌ పుల్లింగ్‌ చేసే సత్తా అల్లు అర్జున్‌కే ఉందంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు పుష్ప ఫ్యాన్స్‌. ఇక దీనిపై పెద్ద ఎత్తున మీమ్స్‌ కూడా వస్తున్నాయి. ఇద్దరు హీరోలా ఫ్యాన్స్‌ విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

First Published:  11 May 2024 2:45 PM GMT
Next Story