Telugu Global
Andhra Pradesh

ఆరోగ్యశ్రీపైనా రామోజీరావు మార్కు బురద

రాష్ట్రంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తాశాయంటూ రామోజీరావు అబద్ధాల రోగాలను వ్యాప్తి చేస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

ఆరోగ్యశ్రీపైనా రామోజీరావు మార్కు బురద
X

పేదలకు కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ మీద కూడా రామోజీరావు బురదజ‌ల్లడం మానలేదు. ఆరోగ్యశ్రీపై ఈనాడులో ఆయన విషపురాతలు రాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందుతోంది. అయితే, ఈ పథకం సక్రమంగా అమలు కావడం లేదంటూ ఈనాడు బురదజ‌ల్లుతోంది.

చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నూతన సంస్కరణలను, విధానాలను అమలులోకి తెచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని ఇటీవలే ప్రభుత్వం రూ.25 లక్షలకు పెంచింది. 1,059 ప్రొసీజర్లను తీసుకుని వెళ్లారు. ప్రొసీజర్ల సంఖ్య పెద్ద యెత్తున పెరగడంతో 2019కి ముందు రోజుకు సగటున 1,547 చికిత్సలు చేయగా, ప్రస్తుతం 5,608 చికిత్సలు చేస్తున్నారు.

రాష్ట్రంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చేతులెత్తాశాయంటూ రామోజీరావు అబద్ధాల రోగాలను వ్యాప్తి చేస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. లబ్ధిదారులకు, ఆరోగ్యశ్రీ సేవలకు కావాలని అంతరాయం కలిగించే ఆస్పత్రులపై చర్యలు కూడా తీసుకుంటున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి రూ.2,146.90 కోట్లను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2,790.61 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ వైద్యులను ప్యానెల్‌ వైద్యులుగా తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

క్యాన్సర్‌ చికిత్స ముందస్తు అనుమతి, క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎయిమ్స్‌, హోమీబాబా, శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన డిఎంఈ, స్విమ్స్‌, విమ్స్‌ వైద్యుల సేవలను వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్‌ ఆమోదంలో తీవ్రమైన జాప్యానికి అవకాశమే లేదు.

లంచాలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే సమయంలో నెట్‌వర్క్‌ ఆరోగ్యమిత్రల పర్యవేక్షణ ఉంటుంది. రోగుల డిశ్చార్జీ సమయాల్లో ఆస్ప‌త్రిలో సేవలు ఎలా అందాయో రోగుల నుంచి అభిప్రాయ సేకరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. డిశ్చార్జీ తర్వాత కూడా రోగులు ఇంటికెళ్లి ఏఎన్‌ఎంలు మరోమారు ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నారు.

ఈ ప్రక్రియలో ఎక్కడైనా రోగులు లంచాలు ఇవ్వడం, చేతి నుంచి డబ్బులు చెల్లించడం వంటివి జరిగిత్తే ఆ డబ్బులు తిరిగి ఇప్పిస్తున్నారు. దాంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. పథకం విషయంలో రోగుల సందేహాలను తీర్చడానికి, వారికి ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు తీసుకోవడానికి 104 కాల్‌ సెంటర్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

First Published:  31 Jan 2024 1:47 PM GMT
Next Story