Telugu Global
Andhra Pradesh

ఎందుకు ఈనాడు బట్టలిప్పేసి నగ్నంగా నర్తించింది..?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని దళితులు సాధికారితను పొందుతున్నారు. స్వాభిమానంతో జీవిస్తున్నారు. సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంగ్లిష్‌ మీడియం చదువులను పేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు.

ఎందుకు ఈనాడు బట్టలిప్పేసి నగ్నంగా నర్తించింది..?
X

విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమతామూర్తి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే వేళ రామోజీరావుగారి ఈనాడు దినపత్రిక బట్టలిప్పేసి నగ్నంగా నర్తించింది. ఇప్పటి వరకు ఈనాడు ముసుగు వేసుకునేది.. కానీ, నిన్న‌టితో ఆ ముసుగును తొలగించడమే కాకుండా పూర్తి దుస్తులిప్పేసి వీధుల్లో నాట్యం చేసింది. వైఎస్‌ జగన్‌కు అంబేడ్కర్‌ విగ్రహాన్ని తాకే అర్హత లేదంటూ పిచ్చి కూతలు కూసింది. ఈనాడు ఆ పిచ్చి రాతలు రాయడం వెనుక అసలు కారణమేమిటనేది ప్రశ్నించుకోవాలి.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని దళితులు సాధికారితను పొందుతున్నారు. స్వాభిమానంతో జీవిస్తున్నారు. సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంగ్లిష్‌ మీడియం చదువులను పేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో రామోజీరావుకు నచ్చిన, ఆయన మెచ్చిన చంద్రబాబు తాబేదారుల కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై పెద్ద దెబ్బ పడింది. రామోజీరావు ఈనాడు రాసిన వార్తాకథనం పైకి రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ మీద ఎక్కుపెట్టిన బాణంలా కనిపిస్తుంది. అయితే, దళిత ప్రజల మీద అక్కసు కొద్ది రాసిన కథనంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు మద్దతు లభిస్తున్నదనే అక్కసు కొద్ది ఆ వార్తాకథనం రాశారని చెప్పవచ్చు.

విజయవాడలో 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్‌ విగ్రహం నిత్యం చంద్రబాబుపైకి వేలెత్తి చూపుతున్నట్లు కూడా రామోజీరావుగారికి అనిపించిందేమో. అందుకే ఆయన తన పత్రికలో విషం కక్కారు. విగ్రహావిష్కరణ రోజు వార్తాకథనం కూడా నీచంగానూ పత్రికా విలువలను కాలరాసేదిగానూ ఉంది. చంద్రబాబు పాలనలో అయితే ఈనాడు రామోజీరావుకు నచ్చని అధికారుల మీద, మంత్రుల మీద, ఇతరుల మీద ఒక లక్ష్యంతో దాడి చేస్తూ ఉండేది. ఇప్పుడు రామోజీరావుకు జగన్‌కు లభిస్తున్న మద్దతు చూసి భయం వేస్తున్నట్లుంది.

చంద్రబాబు తన పాలనను స్వార్థబుద్ధితో, స్వప్రయోజనాలతో సాగించారనే విషయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అనుభవంలో ఉన్నదే. దళితులను, పేదలను మధ్యపెడుతూ ఆయన పబ్బం గడుపుకుంటూ వచ్చారు. దానికి రామోజీరావుగారు బాకా ఊదుతూ వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దళితులపై, వారికి అండగా నిలిచిన జగన్‌పై రామోజీరావు నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గన్నట్లు వార్తాకథనాలను వండి వారుస్తున్నారు.

First Published:  20 Jan 2024 12:05 PM GMT
Next Story