Telugu Global
Andhra Pradesh

మార్గదర్శిలో తనిఖీలు జరిగాయి.. ఏ రికార్డు సీజ్ కాలేదు- ఈనాడు

గతంలో రామోజీరావు, ఆయన సంస్థల జోలికి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సాహసించలేదు. వైఎస్‌ సీఎం అయినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది.

మార్గదర్శిలో తనిఖీలు జరిగాయి.. ఏ రికార్డు సీజ్ కాలేదు- ఈనాడు
X

ఒకప్పుడు మంచికైనా, చెడుకైనా రామోజీరావు పేరును రాయాలంటేనే సాటి మీడియా సంస్థలు కూడా జంకే పరిస్థితి నుంచి, ఇప్పుడు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిగాయని సొంత పత్రికలో ప్రచురించుకునే వరకు పరిస్థితి వచ్చింది.

గతంలో రామోజీరావు, ఆయన సంస్థల జోలికి వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా సాహసించలేదు. వైఎస్‌ సీఎం అయినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. జగన్‌ కూడా ఇటీవల రామోజీరావు కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ఇంప్లీడ్ చేయించారు. దాంతో కేసు కొట్టివేయించుకునే ఆఖరి తరుణంలో పరిస్థితి అడ్డుతిరిగింది. అప్పటి నుంచి ఈనాడులో జగన్‌ ప్రభుత్వంపై దాడి మరింత పెరిగింది.

ఇటు జగన్ కూడా తగ్గడం లేదు. ఏకంగా మార్గదర్శి కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్స్ పేరుతో మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్దంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సేకరించి, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారని వైసీపీ మీడియా ప్రకటించింది.

ఈ దాడులపై ఈనాడు పత్రిక కూడా మొదటి పేజీలోనే వార్తను ప్రచురించుకుంది. విశాఖ, తిరుపతి, గుంటూరు, ఏలూరు, భీమవరం, విజయవాడ, మండపేట, కడప,ప్రొద్దుటూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, తణుకు పట్టణాల్లోని మార్గదర్శి కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారని వివరించింది. అకౌంట్ ఫైల్స్‌ను, పన్ను చెల్లింపు రికార్డులను పరిశీలించారని.. అయితే అధికారులు ఎలాంటి రికార్డులను సీజ్ చేయలేదని ఈనాడు వెల్లడించింది. ఈ తనిఖీలు బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని ఈనాడు వెల్లడించింది.

First Published:  16 Nov 2022 3:34 AM GMT
Next Story