Telugu Global
Andhra Pradesh

సమర్థ‌న‌లోనూ అబద్ధాలేనా? సీరియస్ యాక్షన్ తప్పదా?

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఒకలాగ, జగన్మోహన్ రెడ్డి విషయంలో మరోలాగ వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇక మార్గదర్శి ప్రతిష్టను దెబ్బతీయటానికి ఏపీ ప్రభుత్వం 2022లో ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పటం కూడా తప్పే. మార్గదర్శి మీద ఆరోపణలతో కేసులు మొదలైంది 2006లోనే.

సమర్థ‌న‌లోనూ అబద్ధాలేనా? సీరియస్ యాక్షన్ తప్పదా?
X

మార్గదర్శి పోరు ఢిల్లీకి చేరిందా ? ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటు పే...ద్ద బ్యానర్ కథనాన్ని అచ్చేసుకున్నారు రామోజీరావు. తమను ఆర్థికంగా దెబ్బతీయటానికే ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వార్తలు రాస్తున్నకారణంగానే తట్టుకోలేక మార్గదర్శిలో అక్రమాలంటూ ప్రభుత్వం వేధింపులకు దిగిందంటూ స‌మ‌ర్థించుకున్నారు. ఇలాంటి సమర్థ‌నలతోనే కథనమంతా నిండిపోయింది. విషయం ఏమిటంటే సమర్థ‌నలో కూడా అబద్ధాలే చెప్పుకున్నారు. ఈనాడు స్వతంత్రంగా వ్యవహరిస్తోందని చెప్పుకోవటం తప్పు.

ఉద్దేశ‌పూర్వకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బురద చల్లేస్తున్న విషయం తెలిసిందే. తనకు గిట్టని పార్టీ అధికారంలో ఉండగా, గిట్టని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు ఈనాడులో ప్రభుత్వం విషయంలో ఉన్నది ఉన్నట్లుగా ఏనాడూ రాయలేదు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఒకలాగ, జగన్మోహన్ రెడ్డి విషయంలో మరోలాగ వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇక మార్గదర్శి ప్రతిష్టను దెబ్బతీయటానికి ఏపీ ప్రభుత్వం 2022లో ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పటం కూడా తప్పే. మార్గదర్శి మీద ఆరోపణలతో కేసులు మొదలైంది 2006లోనే.

అంటే గడచిన 17 ఏళ్ళుగా మార్గదర్శిపై కేసులు, కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. ఇక సీఐడీ అడిషినల్ డీజీ సంజయ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో జాతీయ మీడియాను తప్ప తెలుగు మీడియాను అనుమతించలేదన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావటంలేదు. ముఖ్యమంత్రులు ఒక్కోసారి జాతీయ మీడియాతో మాట్లాడాలని అనుకున్నపుడు లోకల్ మీడియాను అనుమతించని సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు సంజయ్ జాతీయ మీడియాతో మాట్లాడాలని అనుకున్నారు కాబట్టే లోకల్ మీడియాను అనుమతించలేదంతే.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మార్గదర్శిలో సోదాలు, రామోజీ, శైలజ విచారణపై ఎల్లో మీడియాలో ఒక్క ముక్క కూడా వార్త రాలేదు. జగన్ మీడియాలో మాత్రమే వార్తలు, కథనాలు వస్తున్నాయి. న్యూట్రల్ అనుకున్న మీడియాలో కూడా వార్తలు కనబడటంలేదు. కాబట్టే లోకల్ మీడియాతో మాట్లాడటం అనవసరమని సంజయ్ అనుకున్నారేమో. సంజయ్ ఎవరితో మాట్లాడాలో కూడా రామోజీనే డిసైడ్ చేస్తారా?

విషయం ఏమిటంటే ఢిల్లీలో సంజయ్ ఐటి, ఈడీ, ఆర్థికశాఖలోని ఎకనమిక్స్ అఫెన్సెస్ వింగ్ లాంటి దర్యాప్తు సంస్థ‌లతో సమావేశమయ్యారట. మార్గదర్శి మోసాలకు సంబంధించిన ఆధారాలను అందించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగి యాజమాన్యంపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరారట. ఇదే సమయంలో దాడులను నిలుపుదల చేయాలని యాజమాన్యం కోర్టులో వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అందువ‌ల్ల‌ తమపై తొందరలోనే సీరియస్ యాక్షన్ తప్పదనే భయం మొదలైనట్లుంది. పైగా గురువారం అమరావతిలో శైలజను సీఐడీ రెండోసారి విచారించబోతోంది. అందుకనే చివరి ప్రయత్నంగా సమర్థ‌న‌ రూపంలో ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టింది.

First Published:  13 April 2023 4:17 AM GMT
Next Story