Telugu Global
Andhra Pradesh

ఏపీలో కూడా ఉచిత ప్రయాణం..? ఈనాడు సరికొత్త 'వ్యూహం'

దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించిందట. ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారట. ఆ కథనంలో ముఖ్యాంశాలు ఇవే.

ఏపీలో కూడా ఉచిత ప్రయాణం..? ఈనాడు సరికొత్త వ్యూహం
X

తెలంగాణలోలాగే ఏపీలో కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఈనాడు ఓ ఆర్టికల్ వేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కూడా చెప్పేసింది. ఏపీలో వైసీపీ ఇలాంటి హామీ ఇవ్వలేదు సరికదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దీన్ని అమలు చేస్తే ఆ ఆర్థిక భారం తట్టుకోవడం కూడా ప్రభుత్వానికి కష్టం. మరి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తలకెత్తుకుంటుంది..? ప్రజలకు అడగకపోయినా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు అమలు చేస్తుంది..? ఇదంతా ఈనాడు 'వ్యూహం'లో భాగమే.

ఇటీవల టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. మహిళలకోసం 'మహాశక్తి' అనే పథకం ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇందులో ఓ హామీ. ఈ హామీని హైలైట్ చేయడమే ఈనాడు 'వ్యూహం'. పనిలో పనిగా వైసీపీపై లేనిపోని ఒత్తిడి పెంచడమే ఈనాడు తక్షణ కర్తవ్యం. టీడీపీ హామీని చూసి వైసీపీ ఉలిక్కిపడుతోందని, మహిళలనుంచి మంచి స్పందన రావడంతో ముందుగా వైసీపీయే ఈ హామీని అమలు చేయబోతోందని ఈనాడు ఓ కథనాన్ని వండివార్చింది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించిందట. ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారట. ఆ కథనంలో ముఖ్యాంశాలు ఇవే.

తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మహిళల ఉచిత ప్రయాణం కూడా ఒకటి. అధికారంలోకి రాగానే ముందు ఆ పథకాన్నే పట్టాలెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటు ఏపీలో కూడా ఈ పథకంపై ప్రజల్లో ఆలోచన రేకెత్తించడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. ఇక్కడ కూడా అలాంటి హామీతో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం మారిన వెంటనే 2024లో ఆ హామీ అమలవుతుందని చెబుతోంది. అయితే వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు.. ఈ ప్రభుత్వమే ఈ హామీని అమలు చేయబోతుందంటూ ఓ కట్టుకథ ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు అంగన్వాడీలు జీతాల పెంపుకోసం రచ్చ చేస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఇలాంటి హామీని తెరపైకి తెస్తోందంటూ గుడ్డకాల్చి మొహంపై వేయాలని చూస్తోంది ఈనాడు. ఈ హామీపై ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి తీసుకొస్తోంది. అంటే ఇప్పుడు ఇదంతా ఫేక్ న్యూస్ అని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనేది ఈనాడు వ్యూహం. ఒకవేళ ప్రభుత్వం అలా ఒప్పుకుంటే.. టీడీపీ హామీకి ఉచిత ప్రచారం లభించినట్టే. వైసీపీ చేయలేని పని టీడీపీ చేసి చూపిస్తుందంటూ మరో కొత్త కథనం అల్లొచ్చు. అందుకే ఎల్లో మీడియా ఈ వ్యూహాన్ని అమలు చేసింది. 'టీడీపీ హామీని అమలు చేయడానికి వైసీపీ తహతహ' అంటూ రెచ్చగొడుతోంది.

First Published:  23 Dec 2023 6:21 AM GMT
Next Story