అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఈడీ ఛార్జిషీట్
ఈడీ తన ఛార్జిషీట్‌లో అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లను చేర్చింది.
BY Telugu Global6 Sep 2023 11:46 AM GMT

X
Telugu Global Updated On: 6 Sep 2023 11:46 AM GMT
అగ్రిగోల్డ్ కుంభకోణంపై నాంపల్లి ఎంఎస్ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌ను న్యాయస్థానం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా అక్టోబర్ 3వ తేదీన న్యాయస్థానానికి హాజరుకావాలని అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల ప్రతినిధులకు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈడీ తన ఛార్జిషీట్‌లో అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లను చేర్చింది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మేర మోసం చేసినట్లు అగ్రిగోల్డ్‌పై అభియోగాలు దాఖలయ్యాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రూ.4,141 కోట్ల మేర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
*
Next Story