Telugu Global
Andhra Pradesh

ఏపీ అసెంబ్లీపై సన్నగిల్లుతున్న ఆశలు

సభ జరిగేది ఐదు రోజులు. తొలి రోజు, రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. మిగిలిన మూడు రోజులూ కూడా పరిస్థితిలో మార్పువచ్చే అవకాశం లేదు. సభకు రాగానే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని, చివరకు సభ నుంచి సస్పెండ్ అవుతున్నారు.

ఏపీ అసెంబ్లీపై సన్నగిల్లుతున్న ఆశలు
X

ఏపీ అసెంబ్లీలో మళ్లీ రచ్చ జరిగింది. రెండో రోజు సభ ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ధరలపై చర్చించాలంటూ పట్టుపట్టారు. పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. గట్టిగా కేకలు వేస్తూ స్పీకర్‌కు విసుగు తెప్పించారు.

దాంతో టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు తీరు ఇతర సభ్యుల హక్కులను హరించేలా ఉందన్నారు. టీడీపీ సభ్యుల చెడు ప్రవర్తనకు చెక్ పెట్టేలా ఏదో ఒక శాశ్వత పరిష్కారం కనుగోనాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గనకు స్పీకర్ సూచించారు. సభ అంటే టీడీపీ ఎమ్మెల్యేలకు గౌరవం లేకుండా పోయిందని, ప్రజలు వీరి తీరును గమనించాలని స్పీకర్ కోరారు.

స్పీకర్‌ సూచనలకు స్పందించిన బుగ్గన రాజేంద్రనాథ్‌.. సభను అడ్డుకునే తీరుకు చెక్ పెట్టేందుకు ఒక పరిష్కారం కోసం ఆలోచిస్తామన్నారు. టీడీపీ సభ్యులు రోజూ ఇదే పనిచేస్తున్నారని, పోడియం వద్దకు వెళ్లి వెకిలి పనులు చేస్తున్నారని, చివరకు మార్షల్స్‌ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని బుగ్గన విమర్శించారు.

సభ జరిగేది ఐదు రోజులు. తొలి రోజు, రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. మిగిలిన మూడు రోజులూ కూడా పరిస్థితిలో మార్పువచ్చే అవకాశం లేదు. సభకు రాగానే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని, చివరకు సభ నుంచి సస్పెండ్ అవుతున్నారు. మొత్తం మీద పక్క రాష్ట్రాల అసెంబ్లీలతో పోలిస్తే ఏపీ అసెంబ్లీలో ప్రమాణాలు పూర్తిగా పడిపోయినట్టుగా అనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ప్రజలు ఆసక్తి, ఆశలు రెండూ సన్నగిల్లాయనే చెప్పవచ్చు.

Next Story