Telugu Global
Andhra Pradesh

రఘురామ కంపెనీ డైరెక్టర్లకు ఎదురుదెబ్బ

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె, ఇతర డైరెక్టర్లు రాజ్‌కుమార్, మధుసూదన్ రెడ్డి, నారాయణప్రసాద్‌, రామచంద్ర అయ్యర్‌ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

రఘురామ కంపెనీ డైరెక్టర్లకు ఎదురుదెబ్బ
X

ఇంద్ భారత్ కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజు కంపెనీ డైరెక్టర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె, ఇతర డైరెక్టర్లు రాజ్‌కుమార్, మధుసూదన్ రెడ్డి, నారాయణప్రసాద్‌,రామచంద్ర అయ్యర్‌ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

నేరపూరిత కుట్ర, మోసం, నకిలీపత్రాల సృష్టి, వాటిని ఉపయోగించడం వంటి నేరాల కింద కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో తమ పేర్లు కొట్టివేయాలని డైరెక్టర్లు రాజ్‌కుమార్‌, మధుసూదన్ రెడ్డిలు గతంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది. దాంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

నిందితుల పిటిషన్‌ను విచారించిన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లి ధర్మాసనం వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. నిందితులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయని.. కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. దర్యాప్తును కొనసాగించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.

First Published:  20 Sep 2022 3:14 AM GMT
Next Story