Telugu Global
Andhra Pradesh

నెక్స్ట్‌ సీఎం అవుతా.. అని కూడా అనలేని నేత.. పవన్‌పై వర్మ మళ్లీ సెటైర్లు

కేఏ పాల్ బల్లగుద్ది.. తానే నెక్స్ట్ సీఎం అంటున్నాడని.. చంద్రబాబు కూడా మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడని.. పవన్ మాత్రం తనని ముఖ్యమంత్రిని చేయండి అని ప్రజలతో అనలేకపోతున్నాడని వర్మ పరోక్షంగా సెటైర్లు వేశాడు.

నెక్స్ట్‌ సీఎం అవుతా.. అని కూడా అనలేని నేత.. పవన్‌పై వర్మ మళ్లీ సెటైర్లు
X

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, కాపు, కమ్మ సామాజిక వర్గాలపై కామెంట్స్ చేశాడు. 'నేను ముఖ్యమంత్రి అవుతా' అని కూడా అనలేని వ్యక్తి పవన్ కల్యాణేనని పరోక్షంగా విమర్శలు చేశాడు వర్మ. పవన్ కల్యాణ్ ఇటీవల చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనను కలిసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రాంగోపాల్ వర్మ పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నాడు.

కేవలం డబ్బు కోసం తన కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేశాడని వర్మ ఇటీవల పవన్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో కమ్మ, కాపు సామాజిక వర్గాలు వర్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తీవ్ర విమర్శలు చేసినప్పటికీ వర్మ తన తీరు మార్చుకోలేదు. మరోసారి పవన్ ను, కమ్మ, కాపు సామాజిక వర్గాలను టార్గెట్ గా చేసుకొని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశాడు.


'కేఏ పాల్ బల్ల గుద్ది తనే నెక్ట్ సీఎం అంటున్నాడు. సీ బీ కూడా గొంతెత్తి అదే పాట. అననిది ఒక్క పీ ఒక్కడే. అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్టేనా?..యాజ్ ఏ పీ ఫ్యాన్, ఐ హర్టెడ్' అని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ తన ట్వీట్లో ఎక్కడ పవన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై విమర్శలు చేశాడు.

కేఏ పాల్ బల్లగుద్ది.. తానే నెక్స్ట్ సీఎం అంటున్నాడని.. చంద్రబాబు కూడా మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడని.. పవన్ మాత్రం తనని ముఖ్యమంత్రిని చేయండి అని ప్రజలతో అనలేకపోతున్నాడని వర్మ పరోక్షంగా సెటైర్లు వేశాడు. అక్కడితో ఆగని వర్మ.. పవన్ ఫ్యాన్ గా ఈ విషయంలో ఫీలవుతున్నా అని మరో సెటైర్ వేశాడు. అయితే వర్మ చేసిన ట్వీట్ పై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర అందిందా..? మళ్లీ మొరగడం స్టార్ట్ చేశావ్..? అని మండిపడుతున్నారు. మరి కొంతమంది ఫ్యాన్స్ కొత్త సంవత్సరం.. కొత్త ప్యాకేజీ ముట్టి ఉంటుందని అందుకే ఇలా మొరుగుతున్నాడని ఫైర్ అయ్యారు.

First Published:  11 Jan 2023 12:48 PM GMT
Next Story