Telugu Global
Andhra Pradesh

పాపం.. టీడీపీ పుండు మీద RGV కారం..!

హేయ్‌ చంద్రబాబు.. మిమ్మల్ని అరెస్టు చేయడాన్ని మీకు సన్నిహితంగా ఉండే సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. వాళ్లని ముందు నుంచి పొడిచి చంపాలని మీకు అనిపించలేదా..?

పాపం.. టీడీపీ పుండు మీద RGV కారం..!
X

స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ట్విట్టర్‌లో వరుసగా సెటైర్లు వేస్తున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్‌ సంచలనంగా మారింది. ఇందులో వెన్నుపోటు అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆర్జీవీ.


చంద్రబాబు అరెస్టు విషయాన్ని టాలీవుడ్‌ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నట్టి కుమార్‌ మినహా ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. హేయ్‌ చంద్రబాబు.. మిమ్మల్ని అరెస్టు చేయడాన్ని మీకు సన్నిహితంగా ఉండే సినిమా ఇండస్ట్రీ పట్టించుకోలేదు. వాళ్లని ముందు నుంచి పొడిచి చంపాలని మీకు అనిపించలేదా అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో హాలీవుడ్‌ నుంచి స్టీఫెన్‌ స్పిల్‌ బర్గ్‌ రేంజ్‌లో వచ్చిన ఢిల్లీ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రాను ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు.. టాలీవుడ్‌ డైరెక్టర్ రాజమౌళి తరహాలో మట్టికరిపించాడని ఆర్జీవీ సెటైర్ వేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన క్షణం నుంచి వీలు దొరికిన ప్రతిసారి సీఎం జగన్‌కు మద్దతుగా చంద్రబాబుపై ట్విట్టర్‌లో సెటైర్స్‌ వేస్తూనే ఉన్నారు ఆర్జీవీ. అటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సైతం వదలట్లేదు.

First Published:  13 Sep 2023 3:42 AM GMT
Next Story