Telugu Global
Andhra Pradesh

ఎన్టీయార్ దే తప్పని బాలయ్య తేల్చేశారా?

ఇపుడీ విషయం మీదే తప్పుచేశామా అని చంద్రబాబు అడగటం అందుకు బాలయ్య సమాధానమిస్తు 'తాను కూడా అప్పుడక్కడే ఉన్నా'నని చెప్పటం వివాదాస్పదమైంది. ప్రమో ప్రకారం చూస్తే చంద్రబాబు చేసిందాంట్లో తప్పేమీలేదని బాలయ్య అన్నట్లుగా అర్ధమొస్తోంది.

ఎన్టీయార్ దే తప్పని బాలయ్య తేల్చేశారా?
X

1995 తెలుగుదేశంపార్టీలో తలెత్తిన సంక్షోభంలో ఎన్టీయార్ వెన్నుపోటు ఘటనపై మళ్ళీ పెద్దఎత్తున చర్చ మొదలైంది. చంద్రబాబునాయుడుతో చేతులు కలిపి వారసులే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన విషయం ఒక చాట్ షో రూపంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒక ఓటీటీలో బాలకృష్ణ నిర్వహిస్తున్న చాట్ షో దీనికి వేదికయ్యింది. చాట్ షో రెండో సీజన్లో చంద్రబాబును ముఖ్యఅతధిగా బాలయ్య పిలిచారు. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలే వేశారు. వాటితో ప్రమోను కట్ చేసి రిలీజ్ చేశారు. అదే ఇపుడు బాగా వైరల్ అయ్యింది.

ఇంతకీ ఆ ప్రమోలో ఉన్నవాటిలో కీలకమైనదేమంటే '1995 సంక్షోభంలో మనం తప్పుచేశామా' ? అని బాలయ్యను చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు. 1995 సంక్షోభం ఏమిటంటే ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని లాగేసుకోవటం, టీడీపీ అధ్యక్షుడిగా ఎన్టీయార్ ను దించేయటం చివరకు పార్టీని చంద్రబాబు లాగేసుకోవటం. ఈ వ్యవహరాలన్నింటినీ జనాలు ఎన్టీయార్ కు వెన్నుపోటుగానే చూస్తుంటే చంద్రబాబు అండ్ కో మాత్రం సంక్షోభంగా చెప్పుకుంటున్నారు.

ఇపుడీ విషయం మీదే తప్పుచేశామా అని చంద్రబాబు అడగటం అందుకు బాలయ్య సమాధానమిస్తు 'తాను కూడా అప్పుడక్కడే ఉన్నా'నని చెప్పటం వివాదాస్పదమైంది. ప్రమో ప్రకారం చూస్తే చంద్రబాబు చేసిందాంట్లో తప్పేమీలేదని బాలయ్య అన్నట్లుగా అర్ధమొస్తోంది. ఇదే విషయమై ఎన్టీయార్ అభిమానులు, ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతి మండిపోతున్నారు.

ఎన్టీయార్ నుండి సీఎం పదవిని, పార్టీని లాగేసుకోవటం సాంకేతికంగా కరెక్టే అయ్యుండచ్చు. కానీ నైతికంగా మాత్రం తప్పే. చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీయారే ఆరోపించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబులో దొరుకుతుంది. 'తండ్రంతటి వాడిని తనకు చంద్రబాబు ద్రోహం చేశాడ'ని ఎన్టీయార్ శాపనార్ధాలు పెట్టిన వీడియోలు కూడా చూడచ్చు. చంద్రబాబును తన తండ్రి అంతగా తప్పుపట్టినా బాలయ్య మాత్రం వెనకేసుకురావటమే ఆశ్చర్యంగా ఉంది. వియ్యంకుడవ్వటంతో చంద్రబాబును బాలయ్య వెనకేసుకు రాక తప్పటంలేదేమో. ఏదేమైనా 1995 ఎపిసోడ్లో తన తండ్రిదే తప్పని, బావయ్య కమ్ వియ్యంకుడు చంద్రబాబు చేసిందే కరెక్టని బాలయ్య తేల్చిసినట్లే ఉంది.

First Published:  14 Oct 2022 6:01 AM GMT
Next Story