Telugu Global
Andhra Pradesh

ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ ప్ర‌మాణ స్వీకారం

జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ సొంత రాష్ట్రం జ‌మ్మూ క‌శ్మీర్‌. ఆయ‌నది న్యాయ‌మూర్తుల కుటుంబం. ఆయ‌న తండ్రి, సోద‌రుడు కూడా న్యాయ‌మూర్తులుగా విధులు నిర్వ‌ర్తించారు.

ఏపీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ ప్ర‌మాణ స్వీకారం
X

ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. విజ‌య‌వాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో రాష్ట్ర‌ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు హాజరయ్యారు.

సొంత రాష్ట్రం జ‌మ్మూ క‌శ్మీర్‌..

జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ సొంత రాష్ట్రం జ‌మ్మూ క‌శ్మీర్‌. ఆయ‌నది న్యాయ‌మూర్తుల కుటుంబం. ఆయ‌న తండ్రి, సోద‌రుడు కూడా న్యాయ‌మూర్తులుగా విధులు నిర్వ‌ర్తించారు. ఆయ‌న సోద‌రుడు జ‌స్టిస్ తీర్థ‌సింగ్ ఠాకూర్ సుప్రీంకోర్టు విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్‌కు పేరుంది. బాంబే హైకోర్టులో నంబ‌ర్ టూ స్థానంలో కొన‌సాగుతూ ఆయ‌న ఏపీ హైకోర్టుకు ప‌దోన్న‌తిపై వ‌చ్చారు.

జ‌స్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 25న జన్మించారు. 1989 అక్టోబరు 18న ఢిల్లీ, జమ్మూకశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాదిగా హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి సేవలందించారు.

First Published:  28 July 2023 6:33 AM GMT
Next Story