Telugu Global
Andhra Pradesh

సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్‌

ఎన్నికల్లో జగన్‌ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారని చెప్పారు బొత్స. మళ్లీ సీఎంగా జగనే రావాలని ప్రజలు కోరుకున్నారన్నారు.

సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం డేట్ ఫిక్స్‌
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌ ప్రమాణస్వీకారం చేయడానికి డేట్‌, ప్లేసు ఫిక్సయ్యాయన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. జూన్‌ 9న విశాఖపట్నంలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలోనూ తాను విశాఖలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

ఎన్నికల్లో జగన్‌ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారని చెప్పారు బొత్స. మళ్లీ సీఎంగా జగనే రావాలని ప్రజలు కోరుకున్నారన్నారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్‌ టైంలో ఉన్న వైబ్రేషన్స్ మళ్లీ ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తున్నాయన్నారు.

ఇక పోలింగ్ తర్వాత చెలరేగిన హింసపై స్పందించిన బొత్స.. టీడీపీ నేతలు సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారన్నారు. తాము సంయమనంతో ఉన్నామని చెప్పారు. జగన్‌ పిలుపిస్తే అంతా నిమిషంలో మారిపోతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ తోకముడవడం ఖాయమన్నారు బొత్స.

First Published:  16 May 2024 1:53 PM GMT
Next Story