Telugu Global
Andhra Pradesh

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు

బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరూ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
X

దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాలనుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికి చాలా కాలంగా చురుకుగా లేరు.

బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరూ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు.

ఒకప్పటి రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు ఏ మాత్రం పొంతన లేదని ఆవేదన వ్యక్తం చేసిన వెంకటేశ్వర రావు, రాజకీయాలు, డబ్బుతో, కక్ష సాధింపులతో నిండిపోయాయన్నారు. తమ కుంటుంబం ఇటువంటి రాజకీయాలు చేయలేదని, అందుకే రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నామని అన్నారు. ఇంకొల్లుతో తనకున్న ప్రత్యేక అనుబంధం రీత్యా ఈ విషయాన్ని ఇక్కడే ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.

కాగా వెంకటేశ్వర రావు 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య, ఎన్టీఆర్ కూతురు, కేంద్రమాజీ మంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

First Published:  15 Jan 2023 2:04 AM GMT
Next Story