Telugu Global
Andhra Pradesh

గోరంట్ల మాధవ్ వీడియోకి కోటి ఆఫర్

గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారం మూడు నెలలుగా నడుస్తోందని ఒక ఆంగ్ల దిన పత్రిక చెబుతోంది. కొందరు వ్యక్తులు ఈ వీడియోను అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు.

గోరంట్ల మాధవ్ వీడియోకి కోటి ఆఫర్
X

గోరంట్ల మాధవ్‌ న్యూడ్ వీడియో ఎలా బయటకు వచ్చిందన్న దానిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. సదరు మహిళ ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే ఆమెను ఏమైనా అంటే తిరిగి ఆమె కేసు పెడితే .. ఎంపీ మరింత ఇరుక్కుంటారన్న భావనతో మౌనంగా ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ వీడియో నకిలీనా, నిజమైనదేనా అని తేల్చే విషయంలోనూ ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల దిన పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారం మూడు నెలలుగా నడుస్తోందని ఆ పత్రిక చెబుతోంది. కొందరు వ్యక్తులు ఈ వీడియోను అమ్మకానికి పెట్టారని చెబుతున్నారు. దాదాపు కోటి రూపాయలకు బేరం పెట్టినట్టు కథనం. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను దక్కించుకునేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు వైసీపీలోని కొందరు వ్యక్తులు కూడా తమ పరిధి వరకు బేరమాడినట్టు కథనం.

అయితే ఈ వీడియోను ఎవరు సొంతం చేసుకుని దాన్ని మీడియాలో ప్రదర్శనకు పెట్టారన్న దానిపై క్లారిటీ లేదు. టీడీపీ మీడియానే ప్రముఖంగా ఈ వీడియోపై రచ్చ చేయడంతో టీడీపీ ఏమైనా ఆ వీడియోను కొనుగోలు చేసిందా అన్న అనుమానాలను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అటు మాధవ్ రాజీనామా కోసం తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. పరిస్థితి చల్లబడే వరకు జిల్లాకు రావొద్దని గోరంట్ల మాధవ్‌కు పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలుస్తోంది.

Next Story