Telugu Global
Andhra Pradesh

నారాయణ.. నారాయణ .. కొండను రేప్ చేయడమేంటి?

‘ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం లాంటి నిర్మాణాలు ఏమీ సాగడం లేదు. కానీ ప్రకృతిని నాశనం చేశారు. పెద్ద కొండను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆయన వాపోయారు.

నారాయణ.. నారాయణ ..  కొండను రేప్ చేయడమేంటి?
X

సీపీఐ నారాయణ వివాదాలకు కేంద్ర బిందువు. నిత్యం ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన విశాఖలో పర్యటించారు. అక్కడ రుషికొండను పరిశీలించారు. గతంలోనూ రుషికొండను చూడాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నారాయణ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. కాగా ఇవాళ మంది, మార్బలంతో మరోసారి రుషికొండకు బయలుదేరారు. అయితే పోలీసులు ఇప్పుడు కూడా అడ్డుకున్నారు.

రుషికొండకు మీరు ఒక్కరు వెళ్లడానికి మాత్రమే.. అనుమతి ఉందని మిగిలిన వారిని వెనక్కి పంపించారు. ఇక నారాయణ ఒక్కరే రుషికొండను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండను రేప్ చేసినట్టుగా తాను భావిస్తున్నానని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 'ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయం లాంటి నిర్మాణాలు ఏమీ సాగడం లేదు. కానీ ప్రకృతిని నాశనం చేశారు. పెద్ద కొండను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' అంటూ ఆయన వాపోయారు.

కాగా కొండను రేప్ చేశారని ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొండను రేప్ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్‌ను గతంలో నారాయణ బ్రోతల్ హౌస్‌తో పోల్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఆపేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. తాజాగా రుషికొండపై రేప్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

First Published:  25 Nov 2022 10:57 AM GMT
Next Story