Telugu Global
Andhra Pradesh

ఏపీలో కోరమాండల్‌ రూ.1000 కోట్ల పెట్టుబడి

మొత్తంగా 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కాకినాడ సమీపంలో నిర్మిస్తున్న ఈ ఫాస్పాటిక్‌ ఫెర్టిలైజర్‌ ప్లాంటు దేశంలోనే రెండో అతిపెద్దది.

ఏపీలో కోరమాండల్‌ రూ.1000 కోట్ల పెట్టుబడి
X

ఎరువుల తయారీలో దిగ్గజ సంస్థగా పేరొందిన కోరమాండల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కాకినాడ సమీపంలో దాదాపు రూ.1000 కోట్లతో ఫాస్ఫరిక్‌ యాసిడ్‌–సల్ఫరిక్‌ యాసిడ్‌ కాంప్లెక్స్‌ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఫాస్పారిక్‌ యాసిడ్ అండ్ సల్ఫరిక్ యాసిడ్‌లను DAP, NPK లాంటి ఎరువుల తయారీలో విరివిగా వాడుతారు. రోజుకు 650 టన్నుల ఫాస్పరిక్ యాసిడ్‌తో 1800 టన్నుల సల్ఫరిక్‌ యాసిడ్‌ను ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనున్నారు.

మొత్తంగా 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కాకినాడ సమీపంలో నిర్మిస్తున్న ఈ ఫాస్పాటిక్‌ ఫెర్టిలైజర్‌ ప్లాంటు దేశంలోనే రెండో అతిపెద్దది. ప్రస్తుతం కోరమాండల్‌కు వైజాగ్‌తో పాడు ఎన్నూర్‌లో ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఉన్నాయి. దేశంలో తయారయ్యే NPK - (నైట్రోజన్, ఫాస్పరస్, పోటాషియం) ఎరువుల్లో 15 శాతం ఇక్కడే ఉత్పత్తి కానున్నాయి.

First Published:  30 April 2024 5:26 AM GMT
Next Story