Telugu Global
Andhra Pradesh

జేసీని క్షమించేసిన కలెక్టర్

స్పందన కార్యక్రమానికి వచ్చే వారు సహనంతో ఉండాలన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

జేసీని క్షమించేసిన కలెక్టర్
X

స్పందన కార్యక్రమంలో తన ముందు దురుసుగా వ్యవహరించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టే యోచన తనకు లేదన్నారు అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి. అనుకున్నట్టు జరగకపోతే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారులు అసహనం ప్రదర్శించడం సాధారణంగా జరుగుతూ ఉంటుందన్నారు. కానీ, అలా అరవడం కరెక్ట్ కాదన్నారు. తన పనితీరుపై అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని జేసీకి సూచించారు.

ప్రభాకర్ రెడ్డి రెండు ఫిర్యాదులు చేశారని.. అందులో ఒకదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో పిటిషన్‌ భూమికి సంబంధించినదని... అన్నీ సక్రమంగా ఉండడంతో భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించామని దానిపై ఆయన అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే వారు సహనంతో ఉండాలన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అయినా సరే అధికారులపై అసంతృప్తి ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

జేసీ.. వెంటనే క్షమాపణ చెప్పు- మంత్రి

కలెక్టర్‌ ముందు దురుసుగా ప్రవర్తించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి ఉషాశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ఒక మహిళా కలెక్టర్ పట్ల జేసీ వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. టీడీపీ నేతల తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు.

Next Story