Telugu Global
Andhra Pradesh

సీఎం జగన్ క్లాస్‌ తీసుకున్నది వీరికే..

నవంబర్‌లో తిరిగి సమీక్ష నిర్వహిస్తానని అప్పటి వ‌ర‌కు అందరి పనితీరు మెరుగుపడాలని సీఎం ఆదేశించారు. సర్వేల ఆధారంగా ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని.. టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే పరిస్థితి తెచ్చుకోవద్ద‌ని సూచించారు.

సీఎం జగన్ క్లాస్‌ తీసుకున్నది వీరికే..
X

ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 27 మందిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 27 మంది కూడా పనితీరు మెరుగు పరుచుకోవాలన్నారు. ఈ 27 మంది గడప గడపకూ కార్యక్రమంలో సరిగా పాల్గొనకపోవడం ప్రధాన కార‌ణంగా చెబుతున్నారు.

గత సమీక్ష సమావేశంలో ఇలాంటి వారు 9 మంది వరకు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 27కు చేరడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం క్లాస్ తీసుకున్న మంత్రుల్లో.. తానేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, విశ్వరూప్‌లున్నారు.

మాజీ మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పనితీరు కూడా సరిగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ధనలక్ష్మి కూడా సరిగా కార్యక్రమాలు చేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలలో 16 రోజులు గడప గడపకు వెళ్లాల్సి ఉండగా.. రెండు నెలల్లో కూడా 16 రోజుల కంటే తక్కువగా కార్యక్రమం చేయడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు.

నవంబర్‌లో తిరిగి సమీక్ష నిర్వహిస్తానని అప్పటి వ‌ర‌కు అందరి పనితీరు మెరుగుపడాలని సీఎం ఆదేశించారు. సర్వేల ఆధారంగా ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని.. టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే పరిస్థితి తెచ్చుకోవద్ద‌ని సూచించారు. గడపగడపకు ఎమ్మెల్యేలే వెళ్లాలని.. బంధువులను పంపితే కుదరదని సీఎం స్పష్టం చేశారు. తమకు మరో వ్యాపారం ఉంది అంటూ రాజకీయాలను పార్ట్ టైం జాబ్‌గా చేస్తామంటే కుదరదని తేల్చేశారు. 175 స్థానాల్లో ఎందుకు గెలుపు సాధించాలన్న పట్టుదల ప్రతి ఎమ్మెల్యేలో ఉండాలన్నారు.

First Published:  28 Sep 2022 9:00 AM GMT
Next Story