Telugu Global
Andhra Pradesh

వైఎస్‌ వల్లే కాలేదన్నారు.. జగన్‌ సక్సెస్‌ అయ్యాడు..!

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనేది నానుడి. ఇది చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతికి పక్కా ఆధారాలు సేకరించారు సీఐడీ అధికారులు.

వైఎస్‌ వల్లే కాలేదన్నారు.. జగన్‌ సక్సెస్‌ అయ్యాడు..!
X

40 ఏళ్ల జీవితంలో అవినీతి మచ్చ లేని జీవితం నాది.. పారదర్శకంగా పాలన చేశా.. మరో సత్య హరిశ్చంద్రుడిని అన్నట్లుగా ప్రసంగాలు చేసేవారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. నన్ను జైలుకు పంపడం మీ నాన్న వైఎస్‌ వల్లే కాలేదు.. నీ వల్ల ఏమవుతుందంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి అనేక సార్లు చంద్రబాబు సవాల్‌ విసిరిన సందర్భాలున్నాయి. గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి బయటపడ్డారు చంద్రబాబు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి బయటపడతారన్న పేరు కూడా ఆయనకుంది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం జైలు ఊచలు లెక్కించబోతున్నారు. ఈ పరిస్థితి వస్తుందని కనీసం ఆయన కలలో కూడా ఊహించి ఉండరు.

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనేది నానుడి. ఇది చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతికి పక్కా ఆధారాలు సేకరించారు సీఐడీ అధికారులు. ఈ అవినీతికి అసలు కుట్రదారు చంద్రబాబేనంటూ సక్సెస్‌ఫుల్‌గా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. పక్కా ఆధారాలతో చంద్రబాబుకు ఉన్న అన్ని దారులు క్లోజ్ చేశారు. దీంతో ఢిల్లీ నుంచి పేరు మోసిన లాయర్లను రప్పించినా లాభం లేకుండా పోయింది.

దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాబు అవినీతిపై విచారణ జరిపి ఆయనకు శిక్ష పడేలా ప్రయత్నాలు చేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల అప్పుడు సాధ్యం కాలేదు. అయితే జగన్‌ మాత్రం ఎక్కడా తొందర పడలేదు. పక్కా ప్లాన్‌ ప్రకారం, సాక్ష్యాధారాలతో చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇరికించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలను వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ వల్ల కానిది జగన్‌ చేసి చూపించాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

First Published:  10 Sep 2023 4:53 PM GMT
Next Story