Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్ ఆదేశం.. చిన్నారి వైద్యం కోసం గంటల్లో రూ. 1లక్ష చెక్కు అందజేత..

మహ్మద్ అలీ చిన్నప్పటి నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం లేచి కూర్చోలేడు. దీంతో కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

వైఎస్ జగన్ ఆదేశం.. చిన్నారి వైద్యం కోసం గంటల్లో రూ. 1లక్ష చెక్కు అందజేత..
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. 4వ దశ జగనన్న విద్యా దీవెన లబ్దిదారులకు బుధవారం మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అన్నమయ్య జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. దీంతో మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

టిప్పు సుల్తాన్ గ్రౌండ్ వద్దకు సీఎం జగన్ వస్తున్నారని తెలుసుకొని హమీద అనే మహిళ తన బిడ్డ మహ్మద్ అలీని ఎత్తుకొని అక్కడకు వచ్చింది. మహ్మద్ అలీ చిన్నప్పటి నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం లేచి కూర్చోలేడు. దీంతో కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని సీఎం జగన్‌ను కలిసి చెప్పుకున్నది. చికిత్స చేయించడానికి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నది. హమీద చెప్పిన విషయాలు జగన్ ఆసాంతం విన్నారు. మహ్మద్ అలీ పడుతున్న బాధను చూసి చలించిపోయారు. వెంటనే జిల్లా కలెక్టర్ గిరీషను పిలిచి ఆర్థిక సాయంతో పాటు పెన్షన్ ఇవ్వాలని, మెరుగైన వైద్యం చేయించాలని ఆదేశించారు.

జగన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వెంటనే కదిలింది. పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రూ. 1 లక్ష చెక్కును ఆమెకు అందించారు. అంతే కాకుండా ప్రతీ నెల రూ. 3వేల పెన్షన్ అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహ్మద్ అలీకి స్విమ్స్‌లో మెరుగైన అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. తాను మొరపెట్టగానే సాయం చేసిన సీఎం జగన్‌కు, కలెక్టర్ గిరీషకు హమీద కృతజ్ఞతలు తెలిపారు.



First Published:  30 Nov 2022 3:17 PM GMT
Next Story