Telugu Global
Andhra Pradesh

ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్.. పవన్ పై విరుచుకుపడ్డ జగన్

ఏపీలో చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జీవితం ఉందన్నారు సీఎం జగన్. దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు అని అన్నారు. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను మనం ఇంతవరకు చూడలేదన్నారు.

ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్.. పవన్ పై విరుచుకుపడ్డ జగన్
X

పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. ఇన్నాళ్లూ ఆయన్ను ప్యాకేజీ స్టార్ గా అభివర్ణించిన ఆయన.. ఇప్పుడు మ్యారేజీ స్టార్ గా కొత్త పదప్రయోగంతో సెటైర్లు పేల్చారు. "వివాహ బంధాన్ని గౌరవించడు, భార్యతో కనీసం మూడేళ్లు కాపురం చేయడు కానీ.. బాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలట.. ఇలాంటి వాళ్లకి ఓటు వేయడం ధర్మమేనా?" అంటూ తనదైన శైలిలో పవన్ పై చెణుకులు విసిరారు జగన్.


భీమవరంలో జరిగిన జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని మరోసారి ఆయన టార్గెట్ చేశారు. పక్కవాడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడిని భీమవరంలో ప్రజలు తిరస్కరించారని, ఆ దత్త పుత్రుడి నివాసం పక్క రాష్ట్రంలో ఉంటుందని, పక్కవాడు ముఖ్యమంత్రి కావాలని ఆయన పార్టీ పెట్టారని విమర్శించారు.

త్యాగరాజు..

ఏపీలో చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జీవితం ఉందన్నారు సీఎం జగన్. దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు అని అన్నారు. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసేవాళ్లను మనం ఇంతవరకు చూడలేదన్నారు. దత్తపుత్రుడికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఓకే అన్నారు. ఈ ప్యాకేజ్ స్టార్ ఆడవాళ్లను ఆట వస్తువులుగానే చూస్తారన్నారు. మూడు నాలుగేళ్లకోసారి భార్యలను మార్చే మ్యారేజ్ స్టార్ కూడా ఆయనేనన్నారు. ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు సీఎం జగన్.

First Published:  29 Dec 2023 8:35 AM GMT
Next Story