Telugu Global
Andhra Pradesh

నెలరోజులపాటు చంద్రబాబు కుదురుగా ఏపీలోనే ఉన్నారు

చంద్రబాబే కాదు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఎవరూ ఏపీలో నెలరోజులపాటు కూడా కుదురుగా ఉండరని, అలాంటి వారు మనకు అవసరమా అని ప్రశ్నించారు సీఎం జగన్.

నెలరోజులపాటు చంద్రబాబు కుదురుగా ఏపీలోనే ఉన్నారు
X

నెలరోజులకు పైగా చంద్రబాబు జైలులో మగ్గిపోతున్నారంటూ టీడీపీ లబోదిబోమంటోంది. సరిగ్గా జగన్ అదే పాయింట్ పై బ్రహ్మాండమైన సెటైర్ పేల్చారు. గతంలో ఎప్పుడూ చంద్రబాబు కుదురుగా ఏపీలో నెలరోజులపాటు ఉండలేదని, కానీ ఇన్నాళ్లకు ఆయన కంటిన్యూగా ఏపీలోనే నెలరోజులపాటు ఉన్నారని చెప్పారు. రాజమండ్రి జైలులో నెలరోజులకు పైగా ఉన్న బాబు, ఏపీలోనే ఉన్నారంటూ జోకులు పేల్చారు. సామర్లకోటలో జగనన్న కాలనీల్లో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. మరోసారి ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


చంద్రబాబే కాదు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఎవరూ ఏపీలో నెలరోజులపాటు కూడా కుదురుగా ఉండరని, అలాంటి వారు మనకు అవసరమా అని ప్రశ్నించారు సీఎం జగన్. జగన్‌ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయని, చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయన్నారు. జగన్‌ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుందని, బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారీల అహంకారం గుర్తొస్తుందన్నారు. రెండేళ్లలోనే రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చామన్నారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయని, ఇప్పుడు కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని చెప్పారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు సీఎం జగన్.

పవన్ పై ఘాటు వ్యాఖ్యలు..

పవన్ కల్యాణ్ పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లో ఉంటుందని, ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని ఎద్దేవా చేశారు. తన అభిమానుల ఓట్లు హోల్‌ సేల్‌ గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు ప్యాకేజ్ స్టార్ ఏపీకి వస్తుంటాడని, సినిమా షూటింగ్స్‌ లేని టైమ్‌లో ఇక్కడికి వచ్చి స్టోరీలు చెబుతాడని, సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్‌ కల్యాణ్ అని అన్నారు. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదని, మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు అని చెప్పారు జగన్. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయని విమర్శించారు.

First Published:  12 Oct 2023 9:24 AM GMT
Next Story