Telugu Global
Andhra Pradesh

ఆర్థిక అనారోగ్యం లేదు..చంద్రబాబుకే అనారోగ్యం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని అందుకే టీడీపీ, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.

ఆర్థిక అనారోగ్యం లేదు..చంద్రబాబుకే అనారోగ్యం
X

ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉందన్నారు సీఎం జగన్. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అది చంద్రబాబుకే ఉన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం జగన్...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని అందుకే టీడీపీ, ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి డబ్బులు రాకుండా అపేయగలిగితే సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి.. అప్పుడు తమకు మంచి జరుగుతుందన్న ఆలోచనతో.. ఏకంగా బ్యాంకులకు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. కోర్టులకూ వెళ్లారన్నారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న‌ స్కీములన్నింటినీ అడ్డుకోవడమే చంద్రబాబు అండ్ టీం పెట్టుకున్న ఒకే ఒక్క స్కీం అని జగన్ ఆరోపించారు. ఇందుకోసం నిరంతరం కష్టపడుతున్నారని సీఎం విమర్శించారు.

రాష్ట్ర జీడీపీ గతంలో కంటే బాగుందన్నారు. జీడీపీ పరంగా గతంలో 21 స్థానంలో ఉంటే ప్రస్తుతం ఆరో స్థానానికి వచ్చామన్నారు. కరోనా సమయంలో జీడీపీ పెరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీతో గత ప్రభుత్వమే ఇప్పటి కంటే ఎక్కువ మొత్తంలో అప్పు చేసిందని జగన్ గణాంకాలను వివరించారు.

Next Story